సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మపై సహచర ఆటగాడు, కర్ణాటక ఓపెనర్ కేఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ బ్యాటింగ్‌కు తాను వీరాభిమానిని అని పేర్కొన్నాడు. అతడి లాంటి స్టార్ ఆటగాడు జట్టులో ఉంటే యువ ఆటగాళ్లకు ఎంతో ప్రేరణ కలుగుతుందన్నాడు. అనేక సందర్భాల్లో రోహిత్ తనకు అండగా నిలిచాడని రాహుల్ పేర్కొన్నాడు. రోహిత్ లాంటి స్టార్ సీనియర్ బ్యాట్స్‌మన్ వెన్నంటి ఉంటే తెలియని ఎనర్జీ వస్తుందన్నాడు. (‘యువీ.. నువ్వు ఇంకా ఆడతావనుకున్నా’)
‘గత కొన్ని నెలలుగా రోహిత్‌తో కలిసి క్రికెట్ ఆడుతున్నాను. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గర క్రికెటర్‌ను చూసినప్పుడు ఓ యువ ఆటగాడు ఎలా సంభ్రమాశ్చర్యంతో మూగబోతాడో.. రోహిత్ గురించి మాట్లాడలంటే నేను కూడా అలాగే మూగబోతాను. ఒక సీనియర్ ఆటగాడిగా రోహిత్ నాకు అనేక సందర్భాల్లో అండగా ఉండేవాడు. అది నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చేది. ప్రతీ ఆటగాడికి ఇలా ఓ సీనియర్ ఆటగాడు అండగా నిలిస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ముఖ్యంగా ఓపెనింగ్ విషయంలో. అయితే నేను నాలుగో స్థానంలోనైనా బ్యాటింగ్ దిగేందుకు సిద్దంగా ఉండటంతో జట్టు కూర్పు సులభతరమవుతుంది’ అంటూ రాహుల్ పేర్కొన్నాడు. (రోహిత్–కోహ్లి జోడీని ఎలా విడగొట్టాలి?)
Comments
Please login to add a commentAdd a comment