
సౌతాంప్టన్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 తమకు గుణపాఠం నేర్పిందని టీమిండియా సారథి విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లి పాల్గొన్నాడు. ఈ వారం రోజుల్లో ఇంగ్లండ్ పిచ్‌లపై జరిగిన మ్యాచ్‌లను చూడటంతో ఓ అవగాహనకు వచ్చామని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఆడాతామని వివరించాడు.
‘చాంపియన్స్ ట్రోఫీ మాకు చాలా నేర్పింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో ఎలా ఆడాలో తెలిసింది. ఆ ట్రోఫీ అనంతరం జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్‌లో జట్టులోకి చేరడం టీమిండియాకు ఎంతో బలాన్నిచ్చింది. వారు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం టీమిండియాకు ఎంతో ముఖ్యం. చాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే.. ప్రస్తుతం టీమిండియా ఎంతో బలంగా ఉంది. జట్టులో సమతూకం పెరిగింది. కేదార్ జాదవ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అతను సెలక్షన్‌కి అందుబాటులో ఉంటాడు. రబబా ఏమన్నాడో నాకు తెలియడు. మెరుగైన ఫాస్ట్ బౌలర్‌గా అతడిని గౌరవిస్తా’అంటూ కోహ్లి పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా రేపు(బుధవారం) టీమిండియా తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment