ICC Champions Trophy 2017
-
ఆ ఫలితాన్ని రిపీట్ చేస్తాం.. పాక్ పేసర్ వార్నింగ్
IND VS PAK T20 World Cup 2021.. చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు మజానే. అందునా ఐసీసీ లాంటి మేజర్ టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పటివరకు జరిగిన ఐసీసీ మేజర్ టోర్నీల్లో టీమిండియాదే ఆధిపత్యం. అయితే 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం టీమిండియాకు తొలిసారి పాక్ చేతిలో పరాభవం ఎదురైంది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అయితే 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా పాకిస్తాన్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. తాజాగా యూఏఈ వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను(అక్టోబర్ 24న) ఎదుర్కోనుంది. మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా పాక్‌పై విజయంతో టోర్నీని ఘనంగా ఆరంభించాలని ఉవ్విళ్లూరుతుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్ 2017 ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈసారి మ్యాచ్‌లో విజయం మాదేనని.. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను పునరావృతం చేయనున్నామని ధీమా వ్యక్తం చేశాడు. ''2017లో భారత్‌ని ఓడించి మేం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అదే స్ఫూర్తితో టీ20 ప్రపంచకప్‌లో కూడా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచులపై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. సాధారణంగా క్రికెట్ మ్యాచులు చూడని అభిమానులు కూడా ఈ పోరుపై ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి, భారత్‌తో తలపడటం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఆటగాళ్లపై కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా, మెరుగ్గా రాణించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఫఖర్ జమన్(114 పరుగులు)- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్ 2017 ఇక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్ విషయానికి వస్తే.. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ ఫఖర్ జమన్ సెంచరీతో(114 పరుగులు) మెరవగా.. మరో ఓపెనర్ అజహర్ అలీ 59 పరుగులు చేశాడు. చివర్లో మహ్మద్ హఫీజ్ 57 పరుగులతో రాణించాడు. అనంతరం 339 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా పాక్ బౌలర్ల దాటికి 158 పరుగులకే కుప్పకూలి 180 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. హార్దిక్ పాండ్యా (43 బంతుల్లో 76 పరుగులు, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మిగతా బ్యాట్స్‌మన్ దారుణంగా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా(76 పరుగులు)- ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ పైనల్ 2017 -
చాంపియన్స్ ట్రోఫీ గుణపాఠం నేర్పింది: కోహ్లి
సౌతాంప్టన్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2017 తమకు గుణపాఠం నేర్పిందని టీమిండియా సారథి విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లి పాల్గొన్నాడు. ఈ వారం రోజుల్లో ఇంగ్లండ్ పిచ్‌లపై జరిగిన మ్యాచ్‌లను చూడటంతో ఓ అవగాహనకు వచ్చామని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఆడాతామని వివరించాడు. ‘చాంపియన్స్ ట్రోఫీ మాకు చాలా నేర్పింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో ఎలా ఆడాలో తెలిసింది. ఆ ట్రోఫీ అనంతరం జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్‌లో జట్టులోకి చేరడం టీమిండియాకు ఎంతో బలాన్నిచ్చింది. వారు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం టీమిండియాకు ఎంతో ముఖ్యం. చాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే.. ప్రస్తుతం టీమిండియా ఎంతో బలంగా ఉంది. జట్టులో సమతూకం పెరిగింది. కేదార్ జాదవ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అతను సెలక్షన్‌కి అందుబాటులో ఉంటాడు. రబబా ఏమన్నాడో నాకు తెలియడు. మెరుగైన ఫాస్ట్ బౌలర్‌గా అతడిని గౌరవిస్తా’అంటూ కోహ్లి పేర్కొన్నాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా రేపు(బుధవారం) టీమిండియా తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. -
టీమంతా ప్రాక్టీస్‌లో.. ధోనీ మాత్రం..
బర్మింగ్‌హామ్: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఐసీసీ చాంపియన్స ట్రోఫీలో తలపడుతున్న టీమిండియా గురువారం జరగనున్న సెమీ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. కీలకమైన మ్యాచ్ కావడంతో జట్టు సభ్యులంతా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మాజీ కెప్టెన్ ధోనీ మాత్రం జట్టుకు దూరంగా.. ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేశారు. భార్య సాక్షి, కూతురు జివాతో కలిసి ధోనీ షికారుకెళ్లినప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండియన్ క్రికెట్ టీమ్ ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఫొటోలను షేర్ చేశారు. ధోనీతోపాటే లండన్ వెళ్లిన సాక్షి.. సౌతాఫ్రికాతో ఇండియా మ్యాచ్‌కు ముందు ‘ఫ్యామిలీ టైమ్’ అంటూ పోస్ట్ చేసిన ఫొటోకూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. చాంపియన్స్‌ట్రోఫీ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఒక్కటి మినహా అంతగా రాణించని ధోనీ.. సెమీస్‌లోనైనా సత్తాచూపుతాడా లేదా వేచిచూడాలి. బర్మింగ్‌హాహ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం(భారత కాలమానం ప్రకారం) భారత్- బంగ్లాల మధ్య సెమీస్ మ్యాచ జరగనుంది. -
అనుష్కతో ఆ మాట చెప్పి ఏడ్చేశాను: కోహ్లీ
లండన్: తన ప్రేయసి అనుష్క శర్మతో తాను షేర్ చేసుకున్న ఓ గుడ్ న్యూస్ అనుభవాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. వారు ఎన్నో ఈవెంట్లకు జంటగా హాజరైన విషయం తెలిసిందే. ఇటీవల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బయోపిక్.. 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' స్పెషల్ షో ఈవెంట్‌కు విరుష్క (విరాట్, అనుష్క) జోడీ హాజరై సందడి చేశారు. అయితే తనకు ఎంతో ఇష్టమైన అనుష్కతో కెప్టెన్‌గా ఎంపికయ్యానన్న శుభవార్త చెబుతూ ఏడ్చేశానని కోహ్లీ తెలిపాడు. 'టెస్ట్ సిరీస్ సందర్భంగా ఆ సమయంలో నేను మొహాలీలో ఉన్నాను. నన్ను కలిసేందుకు అనుష్క అక్కడికి వచ్చింది. నిజంగానే ఆమె నాకు కలిసొచ్చింది. ఆమె వచ్చిన తర్వాత నేను కెప్టెన్ అయ్యాను. ఈ శుభ సందర్భాన్ని ఆమెతో పంచుకోవాలని ఫోన్ చేసి.. నన్ను కెప్టెన్ చేశారని చెప్పాను. భావోద్వేగాన్ని ఆపుకోలేక నిజంగానే ఏడ్చేశాను. ఈ రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆశ్చర్యకరంగా నేను టెస్ట్ కెప్టెన్‌గా ఆడిన తొలిటెస్టు మెల్‌బోర్న్‌లోనూ ఆమె నాతోనే ఉందంటూ' తీపి జ్ఞాపకాలను కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. మరోవైపు జూన్ 15న బంగ్లాదేశ్‌తో జరగనున్న సెమీస్ మ్యాచ్ కోసం కోహ్లీ సేన సన్నద్ధమవుతోంది. -
జట్టు ఆటగాళ్లపై కోహ్లీ తీవ్ర అసంతృప్తి
బర్మింగ్ హామ్: చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో నెగ్గి చాంపియన్స్ ట్రోఫీలో బోణీ కొట్టినా టీమిండియాపై కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తిగా ఉన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన కోహ్లీ సేన గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాక్ పై 124 పరుగుల తేడాతో నెగ్గినా... సహచరులపై కోహ్లీ విమర్శలు గుప్పించాడు. ఫిల్డింగ్ విషయంలో టీమిండియాకు 10 పాయింట్లకుగానూ కేవలం 6 పాయింట్లే ఇచ్చాడు కోహ్లీ. యువరాజ్ సింగ్ ఆటవల్లనే ఇరుజట్లలో భారత్ మెరుగైన జట్టుగా నిలిచిందని కోహ్లీ ప్రశంసించాడు. 'పాక్ జట్టులో అత్యధిక స్కోరు చేసిన అజహర్ అలీ.. భారత్ ఫీల్డింగ్ తప్పిదాల కారణంగా రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఓసారి హార్దిక్ పాండ్య మంచి రనౌట్ చాన్స్ మిస్ చేయగా, మరోసారి భువీ అతడి క్యాచ్ ను వదిలేశాడు. షాదబ్ ఖాన్ ఆడిన బంతిని కేదార్ జాదవ్ క్యాచ్ పట్టకపోవడం లాంటి తప్పిదాలు మరెన్నో కనిపించాయని' కోహ్లీ వివరించాడు. బ్యాటింగ్ విషయంలో మాత్రం జట్టుకు 10కి గానూ 9 మార్కులు కచ్చితంగా ఇస్తానన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లలో అద్భుత ప్రదర్శన చేసిన జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, ఫీల్డింగ్ తప్పిదాలతో మ్యాచ్ చేజారే అవకావం ఉంటుందని జట్టుకు కోహ్లీ విలువైన సూచనలిచ్చాడు. -
రాణించిన కోహ్లీ.. భారత్ విజయం
లండన్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించాడు. 55 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. భారత్ స్కోరు 26 ఓవర్లలో 129/3 వద్ద వర్షం కురవడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. అయితే మ్యాచ్ కు వర్షం పూర్తిగా ఆటంకం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 45 పరుగులతో భారత్ విజేతగా నిలిచింది. అంతకు ముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 38.4 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ పేస్ విభాగానికి న్యూజిలాండ్ తలవంచింది. ఓపెనర్ లూక్ రోంచి (6 ఫోర్లతో 63), చివర్లో నిషమ్ 46 పరుగులతో రాణించడంతో కివీస్ భారత్‌కు 190 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక ఐపీఎల్లో అంతగా ఆకట్టుకోని మహ్మద్ షమీ.. గప్టిల్(9), విలియమ్సన్(8), బ్రూమ్ (0)లను పెవిలియన్ చేర్చి కివీస్ టాపార్డర్‌ను దెబ్బతీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ, భువనేశ్వర్‌లు మూడేసి వికెట్లతో చెలరేగారు. జడేజా 2 వికెట్లు తీయగా, అశ్విన్ , ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ తీశారు. 190 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్ రహానె (7) వికెట్ ను త్వరగా కోల్పోయింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (40; 59 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (0) డకౌట్ అయ్యాడు. కోహ్లీ (55 బంతుల్లో 52 నాటౌట్: 6 ఫోర్లు), ధోనీ (21 బంతుల్లో 17 నాటౌట్) క్రీజులో ఉండగా వర్షం కురిసింది. అప్పటికీ 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి టీమిండియా 129 పరుగులు చేసింది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 45 పరుగులతో భారత్ గెలిచినట్లు ప్రకటించారు. చాంపియన్స్ ట్రోఫీ పర్యటనలో తొలి మ్యాచ్ విజయం సాధించడంపై కోహ్లీ సేన ఉత్సాహం రెట్టింపయింది. -
ఆస్ట్రేలియా క్రికెటర్ కు తప్పిన ముప్పు
లండన్: ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఆసీస్ జట్టు లండన్ కు చేరుకుంది. ఈ క్రమంలో లార్డ్స్ మైదానంలో మ్యాక్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నెట్స్ లో ఓ బౌలర్ విసిరిన బంతి తాకడంతో మ్యాక్స్ వెల్ విలవిల్లాడిపోయాడు. దీంతో తమ సహచరుడికి ఏమైందోనని ఆసీస్ ఆటగాళ్లు కంగారుపడ్డారు. బంతి తాకిన తర్వాత మ్యాక్స్ బాధతో అలాగే నిలుచుండిపోయాడు. ఆసీస్ సహచరులతో పాటు టీమ్ ఫిజియో పీటర్ బ్రక్నర్ పరుగున మ్యాక్స్ వద్దకు వచ్చారు. మ్యాక్స్ వెల్ మెడ పై భాగంలో, దవడకు స్వల్ప గాయమైనట్లు సమాచారం. ఆపై బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆపేసి.. ఫిజియోతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా బౌలర్ విసిరిన బంతి మ్యాక్స్ వెల్ దవడ భాగంలో తాకినట్లు టీమ్ ఫిజియో పీటర్ బ్రక్నర్ తెలిపాడు. మళ్లీ 'కంగారు' పడ్డారు! హెల్మెట్ ధరించడంతో తీవ్రమైన గాయం కాలేదని, కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే చాలన్నాడు. శుక్రవారం జరగనున్న వార్మప్ మ్యాచ్ లో ఓవల్ మైదానంలో రెండుసార్లు ఛాంపియన్ అయిన ఆసీస్, శ్రీలంకతో తలపడనుంది. మ్యాక్స్ వెల్ గాయం తీవ్రతపై ఆసీస్ క్రికెట్ బోర్డు పూర్తి వివరాలు వెల్లడించలేదు. గతంలో ఆసీస్ ప్లేయర్ ఫిల్ హ్యూస్.. హెల్మెట్ ధరించినా బౌలర్ విసిరిన బంతి తగిలి మైదానంలోనే కుప్పకూలి చనిపోయిన విషయం విదితమే. దీంతో అప్పటినుంచీ ఏ క్రికెటర్ కు బంతి తగిలినా ఆ జట్టులో కంగారు తప్పడం లేదు.