అనుష్కతో ఆ మాట చెప్పి ఏడ్చేశాను: కోహ్లీ | I Shared Captaincy News With Anushka is big memory, says Kohli | Sakshi
Sakshi News home page

అనుష్కతో ఆ మాట చెప్పి ఏడ్చేశాను: కోహ్లీ

Jun 13 2017 12:24 PM | Updated on Sep 5 2017 1:31 PM

అనుష్కతో ఆ మాట చెప్పి ఏడ్చేశాను: కోహ్లీ

అనుష్కతో ఆ మాట చెప్పి ఏడ్చేశాను: కోహ్లీ

తన ప్రేయసి అనుష్క శర్మతో తాను షేర్ చేసుకున్న ఓ గుడ్ న్యూస్ అనుభవాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు.

లండన్: తన ప్రేయసి అనుష్క శర్మతో తాను షేర్ చేసుకున్న ఓ గుడ్ న్యూస్ అనుభవాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. వారు ఎన్నో ఈవెంట్లకు జంటగా హాజరైన విషయం తెలిసిందే. ఇటీవల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బయోపిక్.. 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' స్పెషల్ షో ఈవెంట్‌కు విరుష్క (విరాట్, అనుష్క) జోడీ హాజరై సందడి చేశారు. అయితే తనకు ఎంతో ఇష్టమైన అనుష్కతో కెప్టెన్‌గా ఎంపికయ్యానన్న శుభవార్త చెబుతూ ఏడ్చేశానని కోహ్లీ తెలిపాడు.

'టెస్ట్ సిరీస్ సందర్భంగా ఆ సమయంలో నేను మొహాలీలో ఉన్నాను. నన్ను కలిసేందుకు అనుష్క అక్కడికి వచ్చింది. నిజంగానే ఆమె నాకు కలిసొచ్చింది. ఆమె వచ్చిన తర్వాత నేను కెప్టెన్ అయ్యాను. ఈ శుభ సందర్భాన్ని ఆమెతో పంచుకోవాలని ఫోన్ చేసి.. నన్ను కెప్టెన్ చేశారని చెప్పాను. భావోద్వేగాన్ని ఆపుకోలేక నిజంగానే ఏడ్చేశాను. ఈ రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఆశ్చర్యకరంగా నేను టెస్ట్ కెప్టెన్‌గా ఆడిన తొలిటెస్టు మెల్‌బోర్న్‌లోనూ ఆమె నాతోనే ఉందంటూ' తీపి జ్ఞాపకాలను కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. మరోవైపు జూన్‌ 15న బంగ్లాదేశ్‌తో జరగనున్న సెమీస్ మ్యాచ్ కోసం కోహ్లీ సేన సన్నద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement