భార్యకు ప్రేమతో క్రికెటర్ ముద్దు.. వైరల్ | virat kohli and anushka sharma pic posted by kohli | Sakshi
Sakshi News home page

భార్యకు ప్రేమతో క్రికెటర్ ముద్దు.. వైరల్

Published Tue, Feb 20 2018 8:50 PM | Last Updated on Tue, Feb 20 2018 8:50 PM

virat kohli and anushka sharma pic posted by kohli - Sakshi

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి, అనుష్క శర్మల ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న కోహ్లి తన భార్యకు ప్రేమతో ముద్దు పెట్టినట్లుగా ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో కొన్ని గంటల్లోనే 20 లక్షలకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. వన్ అండ్ ఓన్లీ అన్న క్యాప్షన్‌తో కోహ్లి చేసిన పోస్ట్‌కు విశేష స్పందన వస్తోంది. వీరి వెనకాల సైతం ఓ జంట ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉండటం గమనార్హం. భార్యకు ప్రేమతో కోహ్లి ఈ పోస్ట్ చేశాడని కొందరు, జంట చూడచక్కగా ఉందని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

దాదాపు నాలుగేళ్ల ప్రేమాయణం అనంతరం విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు గతేడాది చివర్లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుంటుంబాల సభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో ఎన్నో ఊహాగానాల తర్వాత ఇటలీలో వీరి వివాహం జరిగింది. ఆ వెంటనే ఓ విదేశీ సిరీస్ పర్యటనకు భార్య అనుష్కతో కలిసి కోహ్లి వెళ్లాడు. కోహ్లి దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. అనుష్క శర్మ ‘సూయీ దాగా’  పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు హార్రర్ మూవీ అనుష్క నటించిన పారి మూవీ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.


కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement