హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నాల్గో మ్యాచ్‌లో న్యూజిలాండ్ దీటుగా బదులిస్తున్న సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చురుకైన ఫీల్డింగ్‌తో అబ్బురపరిచిన సంగతి తెలిసిందే. సిక్స్‌లు, ఫోర్లతో విజృంభించి ఆడుతున్న న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మున్రోను కోహ్లి రనౌట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. శివం దూబే వేసిన 12 ఓవర్ నాల్గో బంతిని కవర్స్ మీదుగా షాట్ కొట్టాడు మున్రో. అయితే బౌండరీ లైన్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్ బంతిని అందుకున్న మరుక్షణమే షార్ట్ కవర్స్‌లో ఉన్న కోహ్లికి అందించాడు. బంతిని అందుకున్న కోహ్లి అంతే వేగంతో స్ట్రైకింగ్ ఎండ్‌లోకి విసిరి వికెట్లను గిరటేశాడు. అప్పటికి ఒక పరుగు తీసి మరో పరుగు కోసం యత్నిస్తున్న మున్రో రనౌట్ అయ్యాడు.(ఇక్కడ చదవండి: కోహ్లి ‘వీక్’ పాయింట్ అదేనా?)
ఇప్పుడు వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో కూడా కోహ్లి ఫీల్డింగ్‌లో మళ్లీ మెరిపించాడు. టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల భారీ టార్గెట్ ఛేదనలో న్యూజిలాండ్ దీటుగా బదులిస్తున్న సమయంలో కోహ్లి మరొక రనౌట్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ హెన్రీ నికోలస్(78)ను రనౌట్ చేసి ఇది కదా ఫీల్డింగ్ అనిపించాడు. బుమ్రా వేసిన 29 ఓవర్ మూడో బంతికి రాస్ టేలర్ సింగిల్ తీసే యత్నం చేశాడు. దగ్గర్లో పెట్టి పరుగు కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న నికోలస్ పిలుపు అందించాడు. అయితే కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి అంతే వేగంగా స్పందించి బంతిపైకి అమాంతం పరుగు తీశాడు. బంతిని పట్టుకున్న మరుక్షణమే బ్యాట్స్‌మన్ కంటే వేగంగా పరుగు పెట్టి వికెట్లను గిరటేశాడు. ఈ అనవసరపు సింగిల్ కోసం కివీస్ మూల్యం చెల్లించుకుంది. మంచి ఫామ్‌లో ఉన్న నికోలస్ మూడో వికెట్‌గా పెవిలియన్ వీడాడు. సుమారు 100 స్టైక్‌రేట్‌తో ఆందోళనకు గురి చేసిన నికోలస్ ఔట్‌తో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. నికోలస్ అయ్యే సమయానికి కివీస్ 28. 3 ఓవర్లలో 171 పరుగులతో ఉంది. (ఇక్కడ చదవండి: కోహ్లి మెరుపు ఫీల్డింగ్.. మున్రో బ్యాడ్ లక్)
Comments
Please login to add a commentAdd a comment