
కోల్‌కతా : ఐపీఎల్-11 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్‌లో నిలవాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఇప్పటికే 10 మ్యాచ్‌లు ఆడిన ఇరుజట్లలో కోల్‌కతా ఐదు గెలవగా.. ముంబై నాలుగు గెలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో ముంబై పై చేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి ప్లే ఆఫ్ మార్గాన్నిసుగుమం చేసుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.
గత మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న ముంబై ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది. ఇక కోల్‌కతాలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గాయంతో అండర్-19 స్టార్ శుబ్‌మన్ గిల్ దూరమయ్యాడు. అతని స్థానంలో రింకూ సింగ్ రాగా.. మిచెల్ జాన్సన్ స్థానంలో టామ్ కుర్రాన్ వచ్చాడు.
తుదిజట్లు
కోల్‌కతా : దినేశ్ కార్తీక్(కెప్టెన్), క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రాణా, రింకూ సింగ్, అండ్రీ రస్సెల్, పియూష్ చావ్లా, టామ్ కుర్రాన్, ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
ముంబై : రోహిత్ శర్మ(కెప్టెన్), ఎవిన్ లూయిస్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేపీ డుమినీ, ఇషాన్ కిషాన్, బెన్ కట్టింగ్, మిచెల్ మెక్‌గ్లాన్, జస్ప్రిత్ బుమ్రా, మయాంక్ మార్కండే
Comments
Please login to add a commentAdd a comment