విజయోత్సాహంలో ముంబై ఆటగాళ్లు
కోల్‌కతా : ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ కుదేలైంది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమవడంతో 108 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై 102 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్ దిశగా ముంబై ఇండియన్స్‌కు హ్యాట్రిక్ విజయం నమోదు కాగా.. కోల్‌కతా తమ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. ఇషాన్ కిషాన్ 62 (21 బంతుల్లో, 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) వేగవంతమైన ఇన్నింగ్స్‌కు.. రోహిత్ శర్మ 36(31 బంతులు 2 ఫోర్లు, 1 సిక్స్), బెన్‌కట్టింగ్ 24(8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)లు తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఇన్నింగ్స్ రెండో బంతి నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఆ జట్టు స్టార్ ఓపెనర్ సునీల్ నరైన్ (4) తీవ్రంగా నిరాశ పరిచాడు. మరో 28 పరుగులనంతరం ఉతప్పతో సమన్వయలోపం కారణంగా క్రిస్‌లిన్ 21(15 బంతుల్లో,3 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్ అయ్యాడు. దీంతో కోల్‌కతా వికెట్ల పతనం మొదలైంది. ఆ వెంటనే ఊతప్ప 14(13 బంతులు,2 సిక్స్‌లు), రస్సెల్(2)లు పెవిలియన్ చేరారు. ఈ దశలో బాధ్యతాయుతంగా ఆడుతాడుకున్న కెప్టెన్ దినేశ్ కార్తీక్ (5) అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఆ మరుసటి బంతికే నితీష్ రాణా 21(19 బంతుల్లో,2 ఫోర్లు,1 సిక్స్) కూడా వెనుదిరగడంతో కోల్‌కతా పోరాటం ముగిసింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన రింకూసింగ్ (5), చావ్లా(11), టామ్‌కుర్రాన్(17) వికెట్లను కోల్‌కతా వరుసగా కోల్పయింది. కుల్దీప్ యాదవ్ (5) చివరి వికెట్‌గా వెనుదిరగడంతో 18.1 ఓవర్లకు కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది. ప్రసీద్ కృష్ణ(1) నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో పాండ్యా బ్రదర్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. మార్కెండేయ, కటింగ్, బుమ్రా, మెక్లిగన్, తలో వికెట్ తీశారు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో రెండు రనౌట్‌లు ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment