కోల్‌కతా : ఇషాన్ కిషాన్ వేగవంతమైన హాఫ్ సెంచరీకి కెప్టెన్ రోహిత్ ఇన్నింగ్స్, చివర్లో బెన్‌కట్టింగ్ మెరుపులు తోడవడంతో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్ గార్డేన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.
ముంబై ఓపెనర్లు ఎవిన్ లూయిస్, సూర్యకుమార్ యాదవ్ తొలి వికెట్ 46 పరుగులు జోడించి మంచి శుభారంబాన్ని అందించారు. ఈ దశలో ఎవిన్ లూయిస్ 18(13 బంతుల్లో 3 ఫోర్లు)ను పీయూష్ చావ్లా పెవిలియన్‌కు చేర్చాడు. మరో 16 పరుగుల వ్యవధిలోనే సూర్యకుమార్ యాదవ్ 36(32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)ను సైతం ఔట్ చేశాడు. దీంతో ముంబై 62 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషాన్, కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి దాటిగా ఆడాడు.
చుక్కలు చూపించిన ఇషాన్
కుల్దీప్ యాదవ్ వేసిన 14 ఓవర్‌లో ఇషాన్ వరుస బంతుల్లో నాలుగు సిక్సులు బాది చుక్కలు చూపించాడు. ఈ దాటికి కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో ఈ సీజన్‌లో వేగవంతమైన అర్ధసెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేశాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లభించిన అవకాశాన్ని రోహిత్ అందిపుచ్చుకున్నాడు. చక్కటి షాట్‌లతో ఇషాన్‌కు సహకారం అందించాడు. మరింత దాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఇషాన్ 62 (21 బంతుల్లో, 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) సునీల్ నరైన్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద ఉతప్పకు చిక్కాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా 19(13 బంతుల్లో 2 సిక్స్‌లు) దాటిగా ఆడే ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఆ వెంటనే రోహిత్ 36(31 బంతులు 2 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. చివరి ఓవర్లో బెన్‌కట్టింగ్ 24(8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), కృనాల్ పాండ్యా8 నాటౌట్(2 బంతుల్లో 1 సిక్స్)లు విజృంభించడంతో ముంబై 210 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో చావ్లా మూడు వికెట్లు తీయగా.. నరైన్, కుర్రాన్, ప్రసిద్ కృష్ణాలకు తలో వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment