బీసీసీఐ కోరిక.. కామెంటేటర్‌గా కుల్దీప్‌! | Kuldeep Yadav Turns Commentator For His Own Bowling | Sakshi
Sakshi News home page

బీసీసీఐ కోరిక.. కామెంటేటర్‌గా కుల్దీప్‌!

Published Mon, Oct 8 2018 12:17 PM | Last Updated on Mon, Oct 8 2018 12:35 PM

Kuldeep Yadav Turns Commentator For His Own Bowling - Sakshi

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్... మూడు ఫార్మాట్లలో ఈ ఘనత సాధించిన రెండో టీమిండియా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు భువనేశ్వర్ మాత్రమే ఈ రికార్డు సాధించాడు. మరొకవైపు మూడు ఫార్మాట్స్‌లో ఐదేసి వికెట్లు తీసిన తొలి భారత స్పిన్నర్‌గా నిలిచాడు కుల్దీప్ యాదవ్.  విండీస్‌తో మ్యాచ్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా పదిలం చేయాలని భావించిన బీసీసీఐ... ఓ ప్రత్యేకమైన ఆలోచన చేసింది. తన ఇన్నింగ్స్‌కి తానే కామెంటరీ చెప్పుకోల్సిందిగా కోరింది.

విండీస్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్‌ 272 పరుగుల తేడాతో గెలిచి అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. కాగా, మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్‌కి చేరుకున్నారు. ఈ సందర్భంగా మొదటి వికెట్ తీసిన వీడియోకి కామెంటరీ చెప్పాల్సిందిగా అతడినే కోరారు బీసీసీఐ అధికారులు. దీనిలో భాగంగా హోటల్‌ రూమ్‌కు చేరుకున్న కుల్దీప్‌.. లాప్‌టాప్‌ తీసి తనదైన స్టైల్లో కామెంటరీ చెప్పేసుకున్నాడు. ‘ ‘బాల్ వెనక కాలికి తగిలింది. కుల్దీప్ యాదవ్‌కి మొదటి వికెట్. చాలా మంచి బౌలింగ్... ’ అంటూ ప్రోఫెషనల్ కామెంటేటర్ స్థాయిలో వ్యాఖ్యానం చెప్పాడు కుల్దీప్ యాదవ్.ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్వీటర్‌ పేజీలో పోస్ట్‌ చేసింది. తన బౌలింగ్‌కు కుల్దీప్‌ను వ్యాఖ్యాతగా వహరించాల్సిందిగా తాము కోరిన విషయాన్ని పేర్కొన్న బీసీసీఐ.. ఆ వీడియోను చూడండి అంటూ పోస్ట్‌ పెట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement