పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) అతి కష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని దాటింది. ఆదివారం మొదలైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ క్విటోవా 6-2, 4-6, 7-5తో డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో)పై విజయం సాధించింది.
ఏకంగా పది డబుల్ ఫాల్ట్‌లు చేసిన క్విటోవా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి గట్టెక్కింది. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-0, 6-2తో దియాత్‌చెంకో (రష్యా)పై, 24వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) 6-2, 6-0తో సొరిబెస్ టోర్మో (స్పెయిన్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 19వ సీడ్ పెయిర్ (ఫ్రాన్స్) 6-2, 4-6, 6-4, 1-6, 6-4తో అల్బోట్ (మాల్డొవా)పై, 17వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7-6 (8/6), 7-6 (8/6), 6-4తో చెచినాటో (ఇటలీ)పై గెలిచారు. వర్షం కారణంగా ఇతర మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడింది.
క్విటోవా, సఫరోవా శుభారంభం
Published Mon, May 23 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM
Advertisement
Advertisement