జిబ్రాల్టర్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబుకు... ట్రేడ్‌వైస్ జిబ్రాల్టర్ చెస్ టోర్నీలో మరో డ్రా ఎదురైంది. ఎనిమిదో రౌండ్‌లో అలెగ్జాండర్ మోతేలెవ్ (రష్యా-5.5)తో జరిగిన గేమ్‌ను అతను 51 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఇవాన్ చెపిర్నోవ్ (బల్గేరియా-6)తో జరిగిన గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 41 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు. మహిళా గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... రొమేయిన్ ఎడ్డార్డ్ (ఫ్రాన్స్-5)ల మధ్య జరిగిన గేమ్ 42 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది.
పద్మినికి గ్రాండ్‌మాస్టర్ నార్మ్
ఒడిశాకు చెదిన పద్మిని రౌత్‌కు గ్రాండ్‌మాస్టర్‌కు అవసరమైన నార్మ్ లభించింది. ఎనిమిదో రౌండ్‌లో ఆమె... తమిర్ నబతే (ఇజ్రాయిల్)పై నెగ్గింది. దీంతో పద్మిని ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. పద్మినికి ఇది వరుసగా మూడో గ్రాండ్‌మాస్టర్ నార్మ్.
లలిత్ గేమ్ డ్రా
Published Thu, Feb 5 2015 1:11 AM | Last Updated on Sat, Jun 2 2018 4:03 PM
Advertisement
Advertisement