గోల్డ్‌కోస్ట్ : ప్రపంచ నంబర్‌వన్, భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో చుక్కెదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ స్వర్ణ పోరులో ఓటమి చెందడంతో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో మలేసియాకు చెందిన లీ చోంగ్ వీ 19-21, 21-14, 21-14 తేడాతో కిడాంబి శ్రీకాంత్‌పై విజయం సాధించి స్వర్ణం సాధించాడు.
తొలి గేమ్‌లో హోరాహోరాగా పోరాడి నెగ్గిన భారత షట్లర్ శ్రీకాంత్ ఆపై రెండు వరుస గేమ్‌లు కోల్పోయాడు. దీంతో మ్యాచ్ లీ చోంగ్ వీ వశమైంది. తొలి గేమ్ కోల్పోయిన లీ చోంగ్ వీ ఆపై ఏ దశలోనూ శ్రీకాంత్‌కు అవకాశం ఇవ్వలేదు. అద్భుతమైన స్మాష్‌లతో వరుస పాయింట్లు నెగ్గడంతో శ్రీకాంత్ కాస్త ఒత్తిడికి లోనైనట్లు కనిపించాడు. మూడో గేమ్‌లో సైతం లీ చోంగ్ వీ ఆదినుంచే పాయింట్లపై దృష్టిపెట్టి ఎదురుదాడి చేయడంతో గేమ్‌తో పాటు మ్యాచ్ కోల్పోయిన శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకున్నాడు.
సెమీఫైనల్స్‌లో లీ చోంగ్ వీ 21–16, 9–21, 21–14తో హెచ్‌ఎస్ ప్రణయ్ (భారత్)ను ఓడించిన విషయం తెలిసిందే. భారత్ ఖాతాలో 65 పతకాలు ఉండగా.. అందులో 26 స్వర్ణాలు, 19 రజతాలు, 20 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment