రోస్‌బర్గ్ దూకుడు... | Lewis Hamilton second for Japanese GP behind Nico Rosberg | Sakshi
Sakshi News home page

రోస్‌బర్గ్ దూకుడు...

Published Sun, Oct 9 2016 1:05 AM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM

రోస్‌బర్గ్ దూకుడు... - Sakshi

 సీజన్‌లో ఎనిమిదోసారి పోల్ పొజిషన్  
  నేడు జపాన్ గ్రాండ్‌ప్రి

సుజుకా (జపాన్): ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఎనిమిదోసారి పోల్ పొజిషన్ సాధించాడు. జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో భాగంగా శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఒక నిమిషం 30.647 సెకన్లలో ల్యాప్‌ను ముగించిన రోస్‌బర్గ్ ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో ప్రస్తుతం రోస్‌బర్గ్ (288 పాయింట్లు), హామిల్టన్ (265 పాయింట్లు) మధ్య 23 పాయింట్ల తేడా ఉంది.
 
 భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానం నుంచి, నికో హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్‌‌స: 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. రైకోనెన్ (ఫెరారీ), 4. వెటెల్ (ఫెరారీ), 5. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 6. రికియార్డో (రెడ్‌బుల్), 7. పెరెజ్ (ఫోర్స్ ఇండి యా), 8. గ్రోస్యెన్ (హాస్), 9. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 10. గుటిరెజ్ (హాస్), 11. బొటాస్ (విలియమ్స్), 12. మసా (విలియమ్స్), 13. క్వియాట్ (ఎస్టీఆర్), 14. సెయింజ్ (ఎస్టీఆర్), 15. అలోన్సో (మెక్‌లారెన్), 16. పాల్మెర్ (రెనౌ), 17. బటన్ (మెక్‌లారెన్), 18. మాగ్నుసెన్ (రెనౌ), 19. ఎరిక్సన్ (సాబెర్), 20. నాసర్ (సాబెర్), 21. ఒకాన్ (మనోర్), 22. వెర్లీన్ (మనోర్).
 
 నేటి ప్రధాన రేసు
 ఉదయం గం. 10.25 నుంచి
 స్టార్ స్పోర్‌‌ట్స-2లో ప్రత్యక్ష ప్రసారం

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement