చిట్టగాంగ్: స్పిన్నర్ నాథన్ లయన్ ఐదు వికెట్లతో చెలరేగినా బంగ్లాదేశ్ అద్భుతంగా పోరాడుతోంది. షబ్బీర్ రహమాన్ (66; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (62 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 6 వికెట్లకు 253 పరుగులు చేసింది.
స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై లయన్ టాప్ ఆర్డర్‌ను వరుసగా అవుట్ చేయడంతో 85 పరుగులే 4 వికెట్లు కోల్పోయింది. కానీ షబ్బీర్, రహీమ్ ఐదో వికెట్‌కు 105 పరుగులు జత చేసి బంగ్లాదేశ్‌ను ఆదుకున్నారు.
రాణించిన షబ్బీర్, రహీమ్: బంగ్లాదేశ్ 253/6
Published Tue, Sep 5 2017 12:38 AM | Last Updated on Tue, Sep 12 2017 1:51 AM
Advertisement