ధోనీ నాయకత్వమే.. | Mahendra Singh Dhoni consistent leadership is key to CSK's success, suresh Raina | Sakshi
Sakshi News home page

ధోనీ నాయకత్వమే..

Published Sat, May 23 2015 6:09 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

ధోనీ నాయకత్వమే..

ధోనీ నాయకత్వమే..

కోల్ కతా: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ సక్సెక్ కు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వమే కారణమని సహచర ఆటగాడు సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. గత ఎనిమిది ఎడిషన్లలో చెన్నై నిలకడగా ఆడటం వెనుక ధోనీదే ప్రధాన భూమిక అని స్పష్టం చేశాడు. శుక్రవారం బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ పై చెన్నై మూడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరిన అనంతరం ధోనీపై రైనా ప్రశంసల వర్షం కురిపించాడు.

 

'ధోనీ నిలకడైన కెప్టెన్. ఆ కెప్టెన్ చెన్నై కు ఉండటం అదృష్టం. ఎనిమిది ఐపీఎల్ సీజన్ లలో ఆరుసార్లు ఫైనల్ కు వెళ్లడమే ఇందుకు ఉదాహరణ' అని రైనా తెలిపాడు. అయితే మరోసారి ముంబై ఇండియన్స్ తో తుదిపోరుకు సిద్ధమవుతున్నట్లు రైనా తెలిపాడు. 2013లో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ ను చేజార్చుకున్న సంగతి ఇంకా తమ మదిలో ఉందని రైనా తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement