క్వార్టర్స్ లో ఇంటిదారి పట్టిన హలెప్
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్ లో ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణ సిమోనా హలెప్ (రుమేనియా) క్వార్టర్స్ లోనే ఇంటి దారి పట్టింది. మంగళవారం జరిగిన పోరులో మకారోవా చేతిలో 6-4, 6-0 తేడాతో హలెప్ ఓటమి పాలైంది. తొలి సెట్ లో గట్టిపోటి ఇచ్చినా.. సెట్ ను కాపాడు కోలేకపోయింది.
పూర్తిగా డీలా పడిన హలెప్ రెండో సెట్ లో మాత్రం పూర్తిగా వెనుకబడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గత మ్యాచ్ ల్లో దుమ్ములేపిన హలెప్ ఈ మ్యాచ్ లో మాత్రం ఆకట్టుకోలేక పోయింది. దీంతో మకారోవా సెమీఫైనల్ కు ప్రవేశించింది.