భారత టెన్నిస్‌ జట్టులో మలిష్క | malishka in indian tennis team | Sakshi
Sakshi News home page

భారత టెన్నిస్‌ జట్టులో మలిష్క

Published Sun, Apr 1 2018 10:51 AM | Last Updated on Sun, Apr 1 2018 10:51 AM

malishka in indian tennis team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘దక్షిణాసియా రీజనల్‌ క్వాలిఫయింగ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌’లో పాల్గొనే అండర్‌–12 భారత టెన్నిస్‌ జట్టుకు హైదరాబాద్‌ అమ్మాయి మలిష్క ఎంపికైంది. అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో మలిష్క భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. నేపాల్‌లోకి కఠ్మాండులో ఏప్రిల్‌ 21 నుంచి 28 వరకు టీమ్‌ విభాగంలో ఈ టోర్నీ జరుగుతుంది.

బాలికల జట్టుకు శ్రుతి అహ్లావత్, అంజలి రాఠి, దుర్గాన్షి ఎంపికవగా... మలిష్క రిజర్వ్‌ ప్లేయర్‌గా చోటు దక్కించుకుంది. బాలుర జట్టులో వన్ష్‌ నందల్, హర్ష్‌ ఫొగాట్, రుషీల్‌ ఖోస్లా చోటు దక్కించుకోగా... మానస్‌ మనోజ్‌ రిజర్వ్‌ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ‘శాట్స్‌’ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి భారత జట్టుకు ఎంపికైన మలిష్కను అభినందించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement