లాంగ్‌జంప్‌ విజేత మనోహర్‌ రావు | manohar rao as long jump winner | Sakshi
Sakshi News home page

లాంగ్‌జంప్‌ విజేత మనోహర్‌ రావు

Published Sat, Feb 25 2017 10:30 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

లాంగ్‌జంప్‌ విజేత మనోహర్‌ రావు

లాంగ్‌జంప్‌ విజేత మనోహర్‌ రావు

400 మీటర్ల హర్డిల్స్‌లో శిల్పవల్లికి రజతం
జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ నాలుగోరోజు పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అథ్లెట్లు మనోహర్‌ రావు, శిల్పవల్లి సత్తా చాటారు. గచ్చిబౌలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో లాంగ్‌జంప్‌ ఈవెంట్‌లో మనోహర్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా... 400 మీటర్ల హర్డిల్స్‌లో శిల్పవల్లికి రజత పతకం దక్కింది. శుక్రవారం జరిగిన లాంగ్‌జంప్‌ ఫైనల్లో మనోహర్‌ 4.62మీ. జంప్‌ చేసి విజేతగా నిలిచాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తపన్‌ సేన్‌ గుప్తా (4.53 మీ.), అస్సాంకు చెందిన ప్రోబిన్‌ (4.49 మీ.) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు.  35 ప్లస్‌ మహిళల విభాగంలో జరిగిన 400 మీటర్ల హర్డిల్స్‌లో బబిత (అస్సాం) స్వర్ణాన్ని గెలుచుకోగా... కె. శిల్పవల్లి (తెలంగాణ), వీణ (మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు.


ఇతర వయోవిభాగాల విజేతల వివరాలు
35+ పురుషులు: 110 మీ. హర్డిల్స్‌: 1. యువరాజ్‌ (తమిళనాడు), 2. వర్గీస్‌ (ఢిల్లీ), 3. చిదంబరం (తమిళనాడు). 40+ పురుషులు: 5000 మీ. రేస్‌ వాక్‌: 1. సురేశ్‌ (కేరళ), 2. అరుణ్‌ (ఒడిశా), 3. రామ్‌నివాస్‌ (హరియాణా).
మహిళలు: 400 మీ. హార్డిల్స్‌: 1. అర్చన (ఢిల్లీ), 2. కీర్తన (కేరళ), 3. స్నేహ (మహారాష్ట్ర). 45+ పురుషులు: 5000 మీ. రేస్‌వాక్‌: 1. మాథ్యూ (కేరళ), 2. ధారాసింగ్‌ (మణిపూర్‌), 3. సరోజిని (కేరళ). మహిళలు: 400 మీ. హర్డిల్స్‌: 1. టెర్రీ మారియా (కేరళ), 2. స్నేహల్‌ రాజ్‌పుత్‌ (మహారాష్ట్ర), 3. ప్రిత్పాల్‌ కౌర్‌ (ఢిల్లీ).


50+ పురుషులు: 5000 మీ. రేస్‌వాక్‌: 1. అనూప్‌ కుమార్‌ (ఢిల్లీ), 2. బల్వన్‌ సింగ్‌ (హరియాణా), 3. సూర్యనారాయణ రాజు (ఏపీ). మహిళలు: 5000 మీ. రేస్‌ వాక్‌: 1. బిదేశ్‌ (మణిపూర్‌), 2. శార్ద (కేరళ), 3. రంజన (అస్సాం).
55+ పురుషులు: 5000 మీ. రేస్‌వాక్‌: 1. కుల్దీప్‌ సింగ్‌ (హరియాణా), 2. గుర్దాస్‌సింగ్‌ (పంజాబ్‌), 3. బాలకృష్ణన్‌ (కేరళ). మహిళలు: 5000 మీ. రేస్‌ వాక్‌: 1. ఇలా దత్తా (పశ్చిమ బెంగాల్‌), 2. కల్పన (పశ్చిమ బెంగాల్‌), 3. రమావతి దేవి (అస్సాం). డిస్కస్‌ త్రో: 1. ఊర్మిళ (అస్సాం), 2. సుశీల (హరియాణా), 3. గ్లోరియా (ఛత్తీస్‌గఢ్‌).

60+ పురుషులు: 5000 మీ. రేస్‌వాక్‌: 1. అశ్విని కుమార్‌ (పశ్చిమ బెంగాల్‌), 2. కనకసబతి (తమిళనాడు), 3.నారాయణన్‌ (కేరళ). మహిళలు: హైజంప్‌: 1. అనూదేవి (అస్సాం), 2. లక్ష్మీ (తమిళనాడు), 3. లిపిక (అస్సాం).

65+ పురుషులు: 5000 మీ. రేస్‌వాక్‌: 1. జైసింగ్‌ (హరియాణా), 2. మంజునాథ (కేరళ), 3. నారాయణ్‌ మిశ్రా (ఒడిశా). 70+ పురుషులు: జావెలిన్‌ త్రో: 1 మాన్‌సింగ్‌ (రాజస్థాన్‌), 2. గణేశ్‌ సర్కార్‌ (పశ్చిమ బెంగాల్‌), 3. పి. మాలిక్‌
మహిళలు: డిస్కస్‌ త్రో: 1. సునీత (మణిపూర్‌), 2. మణ (తమిళనాడు), 3. శాంతి (అస్సాం). 80+ పురుషులు: జావెలిన్‌ త్రో: 1. జీవన్‌ భాయ్‌ (గుజరాత్‌), 2. సిద్ధు (పంజాబ్‌), 3. మోహన్‌ భాయ్‌ (గుజరాత్‌). మహిళలు: హైజంప్‌: 1. వసంత శామ్యూల్‌ (తమిళనాడు), 2. రాశి (మణిపూర్‌). 85+ పురుషులు:
జావెలిన్‌ త్రో: 1. దర్శన్‌ సింగ్‌ (ఉత్తరాఖండ్‌), 2. శివరామ కృష్ణన్‌ (ఏపీ), 3. హమీర్‌ సింగ్‌ (పంజాబ్‌).

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement