
ఉలాన్ ఉడె (రష్యా): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఏడో స్వర్ణమే లక్ష్యంగా భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ బరిలోకి దిగనుంది. నేడు మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌లో మేరీకోమ్ 51 కేజీల విభాగంలో మూడో సీడ్‌గా పోటీపడనుంది. తొలి రౌండ్‌లో బై పొందిన ఈ మణిపూర్ బాక్సర్ మంగళవారం నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్‌లో తలపడుతుంది. మేరీకోమ్‌తోపాటు మరో నలుగురికి కూడా తొలి రౌండ్‌లో బై లభించింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్ 2006లో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. స్వదేశంలో జరిగిన ఆ ఈవెంట్‌లో భారత్ రెండు స్వర్ణాలు సహా ఎనిమిది పతకాలు గెల్చుకుంది.
భారత జట్టు: మంజు రాణి (48 కేజీలు), మేరీకోమ్ (51 కేజీలు), జమున (54 కేజీలు), నీరజ్ (57 కేజీలు), సరిత (60 కేజీలు), మంజు (64 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), సవీటి (75 కేజీలు), నందిని (81 కేజీలు), కవిత(ప్లస్ 81 కేజీలు).
Comments
Please login to add a commentAdd a comment