చరిత్ర సృష్టించిన మేరీ కోమ్‌ | Merikom Assured Of 8th World Medal In Boxing Championship | Sakshi
Sakshi News home page

మేరీకోమ్‌తో పాటు మరో ముగ్గురు...

Published Fri, Oct 11 2019 5:58 AM | Last Updated on Fri, Oct 11 2019 8:29 AM

Merikom Assured Of 8th World Medal In Boxing Championship - Sakshi

మన మేరీ మరో ‘ప్రపంచ’ పతకంతో చరిత్ర సృష్టించింది. మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్ లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన స్టార్‌ బాక్సర్‌ మేరీకామ్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో ఆమెకు 8వ పతకం ఖాయమైంది. ఆమెతో పాటు  మంజు రాణి, జమున బొరొ, లవ్లినా బొర్గొహైన్‌  సెమీస్‌ చేరి కనీసం కాంస్యానికి అర్హత సాధించారు.

ఉలన్‌ ఉడే∙(రష్యా): భారత వెటరన్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్ షిప్ లో ఎనిమిదో పతకాన్ని ఖాయం చేసుకుంది. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన ఆమె 51 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఓడినా కనీసం కాంస్యమైనా దక్కుతుంది. గెలిస్తే పసిడి వేటలో పడుతుంది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన మేరీకోమ్‌ 51 కేజీల కేటగిరీలో 5–0తో కొలంబియాకు చెందిన వాలెన్సియా విక్టోరియాను చిత్తుగా ఓడించింది. విశేష అనుభవజు్ఞరాలైన మేరీ ముందు విక్టోరియా పంచ్‌లు నీరుగారాయి. బౌట్‌ ఆరంభం నుంచే ప్రత్యరి్థని తన పిడిగుద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ మణిపూర్‌ వెటరన్‌ బాక్సర్‌ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు.

క్యూబా పురుషుల బాక్సర్‌ ఫెలిక్స్‌ సవన్‌ ఏడు ప్రపంచ పతకాలతో ఉన్న రికార్డును మేరీ చెరిపేసింది. మేరీకోమ్‌ వరల్డ్‌ బాక్సింగ్‌లో ఇప్పటికే 6 స్వర్ణాలతో పాటు ఒక రజతం సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో తలపడిన ఐదుగురు బాక్సర్లలో నలుగురు సెమీస్‌ చేరడంతో భారత్‌కు నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మంజు రాణి (48 కేజీలు), జమున బొరొ (54 కేజీలు), లవ్లినా బొర్గొహైన్‌ (69 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచ వేదికపై రెండు సార్లు కాంస్యాలు గెలిచిన కవిత చహల్‌ (ప్లస్‌ 81 కేజీలు)కు మాత్రం నిరాశ ఎదురైంది.

ఆమె క్వార్టర్స్‌లోనే ఓడిపోయింది. 48 కేజీల బౌట్‌లో మంజురాణి... టాప్‌ సీడ్, గత ‘ప్రపంచ’ ఛాంపియన్ షిప్ కాంస్య విజేత కిమ్‌ హ్యాంగ్‌ మి (దక్షిణ కొరియా)కు షాకిచి్చంది. తొలిసారిగా మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగిన హరియాణా బాక్సర్‌ మంజు 4–1తో కొరియన్‌ను ఇంటిదారి పట్టించింది. 54 కేజీల బౌట్‌లో అస్సామ్‌ బాక్సర్‌ జమున బొరొ కూడా 4–1తో ఉర్సులా గాట్‌లబ్‌ (జర్మనీ)పై నెగ్గింది. 69 కేజీల్లో లవ్లినా 4–1తో ఆరో సీడ్‌ కరొలినా కొస్జెస్కా (పోలండ్‌)పై గెలిచింది. మరో క్వార్టర్స్‌లో కవిత చహల్‌ (ప్లస్‌ 81 కేజీలు) 0–5తో కత్సియరినా కవలెవా (బెలారస్‌) చేతిలో పరాజయం చవిచూసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement