భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కనిపించని ఆసీస్ అభిమానులు
లండన్ : ‘ఐసీసీ ప్రపంచకప్’ క్రికెట్ దేశాలకు పెద్ద పండుగ. తామే మైదానంలో ఆడుతున్నామనే ఫీలింగ్‌తో అభిమానులు మ్యాచ్‌లు చూస్తుంటారు. స్థోమత ఉన్నవారు మ్యాచ్‌లకు వెళ్తుంటారు. క్రికెటే దైవంగా భావించే భారత్‌లో అయితే మరీ ఎక్కువ. తమ జట్టు గెలవాలని పూజలు చేయడం ఇక్కడ సర్వసాధారాణం. ప్రపంచంలో ఏ మూల మ్యాచ్ జరిగినా భారతీయులు వెళ్లి పెద్ద ఎత్తున తమ జట్టుకు మద్దతు పలుకుతారు. ఇక ఆస్ట్రేలియాలో సైతం క్రికెట్ అభిమానులు ఎక్కువే. కానీ ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ దేశ అభిమానులు ఎక్కడా కనిపించలేదు. మైదానమంతా భారత అభిమానులతోనే నిండిపోయింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ట్వీట్ చేశారు.
‘మైదానమంతా వెతికినా ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్‌తో కలిపి ఆసీస్ మద్దతుదారులు 33 మందికి మించిలేరు.’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్ సత్తా అంటే ఇదని ఇండియన్ ఫ్యాన్స్ కామెంట్ చేయగా.. ఆసీస్‌కు క్రికెట్ ఒక్కటే లేదు.. అన్ని క్రీడలున్నాయి అంటూ ఆ దేశ అభిమానులు సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. మరికొందరు టికెట్లు దొరకలేదని లేకుంటే వెళ్లేవాళ్లమని పేర్కొన్నారు.
So far I have seen 33 Aussie supporters in the Ground at the Oval and that includes the Team and support staff ... !!!! #CWC19
— Michael Vaughan (@MichaelVaughan) June 9, 2019
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ శిఖర్ ధావన్ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... విరాట్ కోహ్లి (77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment