
భార్య క్లార్ ర్యాట్‌క్లిఫెతో క్రికెటర్ స్టోక్స్ (ఫైల్ ఫొటో)
బ్రిస్టల్ : ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ తీవ్ర విమర్శలు చేశాడు. స్టోక్స్ ఏం హీరో కాదని, అతడిని హీరోగా చిత్రీకరించే యత్నాలు చేయవద్దని సూచించాడు. బీబీసీ మీడియాతో వాన్ మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించాడు. ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు స్టోక్స్ కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అభిప్రాయపడ్డాడు వాన్. కాగా తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి సహా మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు స్టోక్స్.
‘ఇంగ్లండ్ క్రికెట్ ప్రేమికులకు మనవి చేస్తున్నా. బెన్‌స్టోక్స్‌ను హీరోలా చూడవద్దు. డ్రెస్సింగ్ రూమ్ కూడా అతడి సాధారణ ఆటగాడిగానే చూస్తే మంచిది. అతడు ఆటను వివాదాల్లోకి లాగుతున్నాడు. విలన్‌గా ప్రవర్తిస్తూ స్టోక్స్ ఆటను భ్రష్టు పట్టిస్తున్నాడు. ఓవరాల్ ఇంగ్లండ్ ఫ్యాన్స్‌కు, తనను ప్రేమించే వారికి స్టోక్స్ ఎన్నో క్షమాపణలు చెప్పినా తక్కువే. గత ఏడాదికాలం నుంచి జరిగిన విషయాలపై స్టోక్స్ శ్రద్ధ పెట్టాలి. కుటుంబాన్ని ఇరుకున పడేయకుండా.. జట్టుకు పేరు తెచ్చేలా నడుచుకుంటే ఆ ఆల్‌రౌండర్ కెరీర్‌కు మంచిది. అతడి ప్రవర్తన వల్ల 8 రోజులపాటు క్రౌన్ కోర్టుకు విచారణకు కావాల్సి వచ్చిందని గుర్తుంచుకోవాలని’ స్టోక్స్‌ను ఉద్దేశించి మైఖెల్ వాన్ వ్యాఖ్యానించాడు.
కాగా, వీడియో ఆధారాలు, సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. పోలీసులు నమోదు చేసిన అఫ్రే (బహిరంగ ప్రదేశంలో ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా గొడవకు దిగడం) ఆరోపణల నుంచి స్టోక్స్‌కు విముక్తి కలిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్టోక్స్‌తో పాటు సహ నిందితుడిగా ఉన్న ర్యాన్ అలీని కూడా కోర్టు నిర్దోషిగా తేల్చగా, మూడో నిందితుడు ర్యాన్ హేల్ తప్పు చేయలేదని కోర్టు ఇంతకు ముందే ప్రకటించింది. అయితే ఇద్దరు ‘గే’ వ్యక్తులను రక్షించే ప్రయత్నంలోనే తాను జోక్యం చేసుకుని గొడవకు దిగాల్సి వచ్చిందని స్టోక్స్ వివరణ ఇవ్వగా కోర్టు సంతృప్తి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment