నెటిజన్‌కు చురకలంటించిన మిథాలీ.. | Mithali Raj royally shuts down troll with epic reply | Sakshi
Sakshi News home page

నెటిజన్‌కు చురకలంటించిన మిథాలీ..

Published Tue, Aug 22 2017 9:46 AM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM

నెటిజన్‌కు చురకలంటించిన మిథాలీ.. - Sakshi

నెటిజన్‌కు చురకలంటించిన మిథాలీ..

హైదరాబాద్‌: భారత మహిళల కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అటు మైదానంలో ఇటు బయటా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి సమయాల్లోను సంయమనం కోల్పోదు. ఇక  సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. మిథాలీ రాజ్‌ ఫోటోకు వెక్కిరింతగా ట్వీట్‌ చేసిన ఓ నెటిజన్‌కు ఈ లేడీ సింగం తనదైన శైలిలో చురకలంటించింది. 
 
ఆదివారం  బెంగళూరులో మిథాలీ ఓ క్రికెట్‌ అకాడమీని ప్రారంభించింది. ఈ సందర్భంగా సహచర క్రికెటర్లు మమతా మాబెన్‌, నూషిన్‌ అల్‌ ఖాదిర్‌, వేదా కృష్ణమూర్తితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఈ ట్వీట్‌కు అందరి నుంచి సానుకూల స్పందన రాగా ఒకరు మాత్రం.. చెమటతో ఎబ్బెట్టుగా కనబడుతున్నావు అని ఆ ఫొటోను ఎద్దేవా చేస్తూ కామెంట్‌ చేశాడు.
 
ఇందుకు మిథాలీ ‘నేను మైదానంలో చమటోడిస్తే కానీ ఈ స్థాయికి రాలేదు. దీనికి నేను సిగ్గు పడడంలేదు. ఈ అకాడమీ ప్రారంభించడానికి కూడా నేను గ్రౌండ్‌లోనే ఉన్నా’ అని ఆ నెటిజన్‌ వ్యాఖ్యల్ని తిప్పికొట్టింది. అంతే..ఇక అతడు మళ్లీ నోరు మెదపలేదు. మిథాలీ స్పందించిన తీరును ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement