మిథాలి మీరు హీరోయిన్‌ కాదు: నెటిజన్లు | Insulting tweets target Mithali Raj, question cricketer's dressing sense | Sakshi
Sakshi News home page

మిథాలి మీరు హీరోయిన్‌ కాదు: నెటిజన్లు

Published Thu, Sep 7 2017 11:09 AM | Last Updated on Tue, Sep 12 2017 2:10 AM

Insulting tweets target Mithali Raj, question cricketer's dressing sense



సాక్షి, హైదరాబాద్‌:
భారత మహిళల కెప్టెన్‌ మిథాలి రాజ్‌కు నెటిజన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె డ్రెస్సింగ్‌ సెన్స్‌పై నెటిజన్లు ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ ఫోటోను ట్వీట్‌ చేసిన మిథాలికి ఫోటోను తొలగించాలంటూ కామెంట్స్‌ వచ్చాయి. మిథాలి సహచర క్రిడాకారిణీలతో ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. అయితే నెటిజన్లు మాత్రం ఫోటోలో మిథాలి డ్రెస్స్‌ బాలేదని, ఫోటోను తొలిగించాలని సూచిస్తున్నారు.
 
మరికొందరైతే మీరు హీరోయిన్‌ కాదు క్రికెటర్‌ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక్కడి ప్రజల గురించి తెలిసి కూడా అలాంటి ఫోటోను షేర్‌ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  గత నెలలో కూడా మిథాలికి ఇదే అనుభవం ఎదురైంది.  ఓ నెటిజన్‌ మిథాలి చెమటపై కామెంట్‌ చేశాడు. దీనికి ఆమె తీవ్రంగానే మందలించింది. అయితే ఇప్పటి కామెంట్స్‌కు మాత్రం మిథాలి స్పందించలేదు.  
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement