dressing Sense
-
'స్టార్ హీరో కూతురు అయ్యుండి.. ఇలాంటి బట్టలు వేసుకుందేంటి'?
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. ఆరోజు మరింత అందంగా, ప్రత్యేకంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. వారి వివాహ వేడుకకు ఎలాంటి దుస్తులు, ఆభరణలు ధరిస్తారు అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆరాటపడుతుంటారు. దీనికి తగ్గట్లు గానే కొన్ని నెలల ముందు నుంచే తారలు ప్రముఖ డిజైనర్లతో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. అయితే ఎంత ప్రత్యకంగా కనిపించాలని ఆరాటపడినా కొన్నిసార్లు మిస్‌ఫైర్ అవుతుంటుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ విషయంలోనూ ఇదే జరిగిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గత రాత్రి(జనవరి3)న ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖర్‌తో ఇరాఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లు ధరించిన కాస్ట్యూమ్స్‌పై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తుంది. వరుడు బ్లూ కలర్ షేర్వానీలో కనిపించగా, వధువు ఇరాఖాన్ సింపుల్‌గా పటియాలా-చోలి దుస్తుల్లో కనిపించింది. అయితే స్టార్ హీరో కూతురు అయ్యిండి ఇలాంటి బట్టలు వేసుకుందేంటి? అర్జెంట్‌గా ఈమెకు స్టైలిస్ట్ అవసరం ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla (@pinkvilla) ఎంత సింప్లిసిటీ ప్రదర్శించినా పెళ్లంటే కాస్తైనా గౌరవం ఉండాలి కదా? జాగింగ్ చేస్తూ నుపుర్ పెళ్లి వేడుకకు రావడం ఏంటి? జిమ్ డ్రెస్‌లో పెళ్లి తంతు ముగించడం ఏంటి? కనీసం బట్టలు అయినా పద్దతిగా వేసుకున్నారా అంటే అదీ లేదు. ఇదేదో కొత్తరకం స్టైల్ అనుకుంటున్నారేమో, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది మీ డ్రెస్సింగ్ అంటూ కొత్త జంటపై విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంతకుముందు అయితే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా పెళ్లి దుస్తుల్లో సంప్రదాయక ఎరుపురంగు ఉండేలా చూసుకునేవారు. కానీ ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు పెళ్లికి కొంచెం ట్రెండు మార్చి డిఫరెంట్ కలర్స్‌ని ఎంచుకున్నారు. అనుష్క శర్మ నుంచి పరిణితి చోప్రా వరకు.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పేస్టల్ కలర్స్ ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఇరాఖాన్ ఇలా నీలం రంగు దుస్తుల్లో, కొల్హాపురి చప్పల్స్‌తో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. అయినా ఎవరి వ్యక్తిగత ఇష్టాలు, అభిప్రాయాలు వారివి. నిజం చెప్పాలంటే ఈ జంట హంగు, ఆర్భాటాలతో కాకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకోవడం ఆదర్శమని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
వింటర్లో వివాహా వేడుకలు..ఇలా స్టైలిష్‌గా మారిపోండి
వివాహ వేడుకలకు ఎప్పుడూ ఒకే విధంగా ముస్తాబు అవడం బోర్ అనిపించినవారు ప్రయోగాత్మకంగా కొన్ని మార్పులు చేసుకోవచ్చు. రిసెప్షన్ మొదలుకొని సంగీత్, హల్దీ, బ్రైడల్షవర్ .. అంటూ పెళ్లి వరకు ఈ వింటర్ సీజన్లో జరిగే ఒక్కో వేడుకకు ఒక్కో స్పెషల్ డ్రెస్‌తో స్టయిలిష్‌గానూ, అందంగానూ కనిపించేలా వస్తున్న డిజైన్స్‌ని ఇలా ఫాలో అయిపోవచ్చు. లాంగ్ కోట్ శీతాకాలం వెల్వెట్ లేదా బ్రొకేడ్ ఎంబ్రాయిడరీ లాంగ్ కోట్స్ అన్ని వేడుకల్లో డ్రెస్సుల మీదకు ధరించవచ్చు. చలి నుంచి రక్షణతో పాటు ఇండోవెస్ట్రన్ లుక్‌తో మెరిసిపోతారు. ఎంబ్రాయిడరీ ఫ్రాక్ స్టైల్ డ్రెస్సింగ్ గ్రాండ్‌గా ఉండాలనుకునేవారు ప్లెయిన్ పట్టు క్లాత్కి ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దుకోవచ్చు. లెహంగా, ఫ్రాక్, దుపట్టా పూర్తి ఎంబ్రాయిడరీ వేడుకలో రిచ్ లుక్‌ను సొంతం చేస్తుంది. పట్టు కుర్తా లెహంగా లాంగ్ స్లీవ్స్ కుర్తా, లెహంగా, దుపట్టా పట్టు కాంబినేషన్‌తో డిజైన్ చేయించుకుంటే వేడుకలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఐదురోజులు జరిగే పెళ్లి వేడుకకు ఏదో ఒకరోజు మీదైన ప్రత్యేకతను చూపించవచ్చు. శారీ స్టైల్ ఒకేతరహాలో చీరకట్టు ప్రత్యేకత ఏముంది అనుకునేవారు లాంగ్ జాకెట్స్ లేదా సైడ్ కుచ్చుల అలంకరణతో స్టైలిష్ లుక్ తీసుకురావచ్చు. కట్టులో ప్రత్యేకత ఫ్లోరల్ డిజైన్స్ ఏ సీజన్‌కైనా బాగా నప్పుతాయి. సిల్క్ ఫ్లోరల్ శారీని ప్లెయిన్ వడ్డాణంతో కలిపి, అందంగా రాప్ చేస్తే.. వేడుకలో హైలైట్‌గా నిలవచ్చు. కుర్తా పైజామా క్యాజువల్ వేర్‌గా ఉండే ఈ డ్రెస్‌ను ఎంబ్రాయిడరీ, కలర్ కాంబినేషన్‌తో వెడ్డింగ్ ఔట్‌ఫిట్‌గా మార్చేయవచ్చు. ధోతీ టాప్ ఎంబ్రాయిడరీ లాంగ్ స్లీవ్స్ టాప్, బాటమ్‌గా ధోతీ ΄్యాంట్ వేడుకలో స్పెషల్ లుక్‌తో ఆకట్టుకునేలా చేస్తుంది. ధోతీ, టాప్లకు చిన్న జరీ అంచు వచ్చేలా డిజైన్ చేయించుకోవచ్చు. -
మిథాలి మీరు హీరోయిన్ కాదు: నెటిజన్లు
సాక్షి, హైదరాబాద్: భారత మహిళల కెప్టెన్ మిథాలి రాజ్‌కు నెటిజన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌పై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ ఫోటోను ట్వీట్ చేసిన మిథాలికి ఫోటోను తొలగించాలంటూ కామెంట్స్ వచ్చాయి. మిథాలి సహచర క్రిడాకారిణీలతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అయితే నెటిజన్లు మాత్రం ఫోటోలో మిథాలి డ్రెస్స్ బాలేదని, ఫోటోను తొలిగించాలని సూచిస్తున్నారు. మరికొందరైతే మీరు హీరోయిన్ కాదు క్రికెటర్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక్కడి ప్రజల గురించి తెలిసి కూడా అలాంటి ఫోటోను షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత నెలలో కూడా మిథాలికి ఇదే అనుభవం ఎదురైంది. ఓ నెటిజన్ మిథాలి చెమటపై కామెంట్ చేశాడు. దీనికి ఆమె తీవ్రంగానే మందలించింది. అయితే ఇప్పటి కామెంట్స్‌కు మాత్రం మిథాలి స్పందించలేదు. #tb #PostShootSelfie #funtimes #girlstakeover pic.twitter.com/p5LSXLYwmA — Mithali Raj (@M_Raj03) 6 September 2017 Hey mithali raj u not a actrees.u r a cricketer .y so glamorous — naveenashok (@naveenashok2) 6 September 2017 Delete it mam it's not good! people idolize you but this dressing sense doesn't is -
డేటింగ్‌కి వెళ్లేటప్పుడు... అవి వేసుకోకూడదు!
‘‘మనం ఏ బట్టలు వేసుకున్నా అవి సౌకర్యవంతంగా ఉండాలి. మన డ్రెస్సింగ్ సెన్స్ కొంతవరకూ మన వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తుంది’’ అని శ్రీయ అంటున్నారు. దాదాపు పదమూడేళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎంత స్లిమ్‌గా ఉన్నారో ఇప్పుడూ ఈ బ్యూటీ అలానే ఉన్నారు. అందం గురించి పక్కనపెడితే సినిమాల్లోనే కాకుండా విడిగా కూడా శ్రీయ వేసుకునే డ్రెస్సులు చాలా బాగుంటాయి. ఓ ఆంగ్ల పత్రిక ఆమెతో జరిపిన ఇంటర్వ్యూలో ‘ఒకవేళ మీరు డేటింగ్‌కి వెళితే ఎలాంటి, డ్రెస్ వేసుకుంటారు? డేటింగ్‌కి వెళ్లేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి?’ అనే ప్రశ్నలు అడిగింది. దానికి శ్రీయ చాలానే చెప్పారు. ‘‘అది నా మూడ్‌ని బట్టి ఉంటుంది. ఆ సమయానికి సంప్రదాయబద్ధంగా డ్రెస్‌లు వేసుకోవాలనిపిస్తే, అలాగే చేస్తా. లేకపోతే చిట్టిపొట్టి దుస్తులు కూడా ధరిస్తా. డేటింగ్‌కి వెళ్లేటప్పుడు మనసుకీ, శరీరానికీ హాయిగా ఉండే డ్రెస్సులయితే బెస్ట్. అలాగే, హై హీల్స్ చెప్పులు వేసుకోకపోవడం బెటర్. ఎందుకంటే, వాటివల్ల ఒక్కోసారి అడ్డంగా పడిపోయే ప్రమాదం ఉంది’’ అని శ్రీయ నవ్వుతూ అన్నారు. -
సౌత్హీరోయిన్స్ఫ్యాషన్పై సమంత కామెంట్స్..?