
డేటింగ్‌కి వెళ్లేటప్పుడు... అవి వేసుకోకూడదు!
‘‘మనం ఏ బట్టలు వేసుకున్నా అవి సౌకర్యవంతంగా ఉండాలి. మన డ్రెస్సింగ్ సెన్స్ కొంతవరకూ మన వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తుంది’’ అని శ్రీయ అంటున్నారు. దాదాపు పదమూడేళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎంత స్లిమ్‌గా ఉన్నారో ఇప్పుడూ ఈ బ్యూటీ అలానే ఉన్నారు. అందం గురించి పక్కనపెడితే సినిమాల్లోనే కాకుండా విడిగా కూడా శ్రీయ వేసుకునే డ్రెస్సులు చాలా బాగుంటాయి. ఓ ఆంగ్ల పత్రిక ఆమెతో జరిపిన ఇంటర్వ్యూలో ‘ఒకవేళ మీరు డేటింగ్‌కి వెళితే ఎలాంటి, డ్రెస్ వేసుకుంటారు? డేటింగ్‌కి వెళ్లేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి?’ అనే ప్రశ్నలు అడిగింది.
దానికి శ్రీయ చాలానే చెప్పారు. ‘‘అది నా మూడ్‌ని బట్టి ఉంటుంది. ఆ సమయానికి సంప్రదాయబద్ధంగా డ్రెస్‌లు వేసుకోవాలనిపిస్తే, అలాగే చేస్తా. లేకపోతే చిట్టిపొట్టి దుస్తులు కూడా ధరిస్తా. డేటింగ్‌కి వెళ్లేటప్పుడు మనసుకీ, శరీరానికీ హాయిగా ఉండే డ్రెస్సులయితే బెస్ట్. అలాగే, హై హీల్స్ చెప్పులు వేసుకోకపోవడం బెటర్. ఎందుకంటే, వాటివల్ల ఒక్కోసారి అడ్డంగా పడిపోయే ప్రమాదం ఉంది’’ అని శ్రీయ నవ్వుతూ అన్నారు.