మిజోరం ‘సంతోషం’ | Mizoram annexes maiden Santosh Trophy | Sakshi
Sakshi News home page

మిజోరం ‘సంతోషం’

Published Mon, Mar 10 2014 1:24 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

మిజోరం ‘సంతోషం’ - Sakshi

మిజోరం ‘సంతోషం’

తొలిసారి జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సొంతం
 సిలిగురి: జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో సంచలనం నమోదైంది. అందరి అంచనాలను తారుమారుచేస్తూ ఆద్యంతం అద్భుతంగా ఆడిన మిజోరం జట్టు తొలిసారి జాతీయ చాంపియన్‌గా అవతరించింది. 68 ఏళ్ల ఈ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన మిజోరం... ఆదివారం రైల్వేస్ జట్టుతో జరిగిన తుదిపోరులో 3-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది.
 
  జికో జోరెమ్సంగా (44వ, 61వ నిమిషాల్లో) రెండు గోల్స్, లాల్రింపియా (90+1వ నిమిషం) ఒక గోల్ నమోదు చేశారు. పలుసార్లు వచ్చిన అవకాశాలను సొమ్ము చేసుకోలేకపోయిన రైల్వేస్ గోల్ రహితంగా మిగిలిపోయింది. దీంతో 28 ఏళ్ల తరువాత తొలిసారి ఫైనల్‌కు చేరినా టైటిల్‌ను మాత్రం సాధించలేకపోయింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా మూడుసార్లు (1961, 1964, 1966) విజేతగా నిలిచిన రైల్వేస్ ఇంతకుముందు 1986లో చివరిసారిగా ఫైనల్‌కు చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement