santosh trophy
-
తెలంగాణ ‘డ్రా’తో మొదలు
సాక్షి, హైదరాబాద్: ఐదున్నర దశాబ్దాల తర్వాత హైదరాబాద్ గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (రెండో రౌండ్)లో తెలంగాణ ‘డ్రా’తో మొదలు పెట్టింది. శ్రీనిధి ఫుట్‌బాల్ క్లబ్ గ్రౌండ్లో శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణితో ఆడాయి. అడపాదడపా తెలంగాణ స్ట్రయికర్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా స్కోరు చేసేందుకు చేసిన ప్రయత్నాల్ని రాజస్తాన్ డిఫెండర్లు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.అలాగే రాజస్తాన్ దాడుల్ని తెలంగాణ రక్షణ పంక్తి నిలువరించడంతో మొదటి అర్ధభాగం ఒక్క గోల్ అయినా నమోదుకు కాకుండానే 0–0తో ముగిసింది. ద్వితీయార్ధం మొదలైన ఎనిమిది నిమిషాలకే రాజస్తాన్ ఖాతా తెరిచింది. 53వ నిమిషంలో ఫార్వర్డ్ ఆటగాడు అమిత్ గోడార చక్కని సమన్వయంతో తెలంగాణ డిఫెండర్లను బోల్తాకొటిస్తూ గోల్‌ను లక్ష్యానికి చేర్చడంతో రాజస్తాన్ 1–0తో ఆధిక్యంలో వెళ్లింది. తర్వాత స్కోరు సమం చేసేందుకు తెలంగాణ స్ట్రయికర్లు ఎంతగా శ్రమించినా ఫినిషింగ్ లోపాలతో గోల్ అయితే కాలేదు. ఇక పరాజయం ఖాయమనుకున్న దశలో అనూహ్యంగా తేజావత్ సాయి కార్తీక్ ఆఖరి నిమిషంలో అద్భుతం చేశాడు. 90వ నిమిషంలో చాకచక్యంగా సాయి కార్తీక్ చేసిన గోల్‌తో తెలంగాణ 1–1తో గట్టెక్కింది. గోల్ పోస్ట్ వద్ద రాజస్తాన్ స్ట్రయికర్లను నిలువరించిన తెలంగాణ డిఫెండర్ తజాముల్ హుస్సేన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టోర్నీ రెండో రౌండ్లో మొత్తం 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. టాప్–4లో నిలిచిన టీమ్‌లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. శనివారం జరిగిన ఇతర మ్యాచ్‌లలో బెంగాల్ 3–1తో జమ్మూ కశీ్మర్‌పై... మణిపూర్ 1–0తో సరీ్వసెస్‌పై గెలుపొందాయి. -
57 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో సంతోష్ ట్రోఫీ ఫైనల్
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ‘సంతోష్ ట్రోఫీ’ ఫైనల్ రౌండ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 14 నుంచి 31 వరకు క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ను నిర్వహిస్తామని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సోమవారం ప్రకటించింది. చివరిసారి హైదరాబాద్ 1967లో సంతోష్ ట్రోఫీ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. ఈసారి ఫైనల్ రౌండ్ టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడతాయి. ఇందులో తొమ్మిది గ్రూప్ విజేతలుగా కాగా... గత ఏడాది చాంపియన్ సర్వీసెస్, రన్నరప్ గోవా జట్లు ఉన్నాయి. 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ దశ మ్యాచ్‌లు డెక్కన్ ఎరీనాలో జరుగుతాయి. నాకౌట్ మ్యాచ్‌లు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తారు. రెండు గ్రూప్‌ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు డిసెంబర్ 26, 27వ తేదీల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడతాయి. సెమీఫైనల్స్ డిసెంబర్ 29న, ఫైనల్ డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సంతోష్ ట్రోఫీ 77 సార్లు జరిగింది. పశ్చిమ బెంగాల్ జట్టు రికార్డుస్థాయిలో 32 సార్లు విజేతగా నిలిచింది. -
సంతోష్ ట్రోఫీ ఫైనల్.. 54 ఏళ్ల నిరీక్షణకు తెర
దేశవాలీ ఫుట్‌బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీని కర్ణాటక సొంతం చేసుకుంది. 54 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలవడం విశేషం. శనివారం రాత్రి మేఘాలయాతో జరిగిన ఫైనల్ పోరు నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కర్ణాటక 3-2 తేడాతో మేఘాలయాను ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది. కర్ణాటక తరపున సునీల్ కుమార్(ఆట 3వ నిమిషం), బెకి ఓరమ్(20వ నిమిషం), రాబిన్ యాదవ్(44వ నిమిషం) గోల్స్ చేయగా.. మేఘాలయ తరపున బర్లింగ్టన్(8వ నిమిషం), షీన్(60వ నిమిషం) రెండు గోల్స్ కొట్టారు. అయితే ఆట తొలి సగంలోనే ఇరజట్లు కలిపి నాలుగు గోల్స్ కొడితే.. అందులో మూడు కర్ణాటక చేయగా.. ఒకటి మేఘాలయ ఖాతాలోకి వెళ్లింది. అయితే రెండో సగంలో మేఘాలయా మరొక గోల్ చేసినప్పటికి కర్ణాటక డిఫెన్స్‌ను నిలువరించలేక చేతులెత్తేసింది. ఇక కర్ణాటక 1968-69 సీజన్లో తొలిసారి సంతోష్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 😄😄😄#MEGKAR ⚔️ #HeroSantoshTrophy 🏆 #GrandFinale 💥 #IndianFootball ⚽ pic.twitter.com/1gqSRz8jns — Indian Football Team (@IndianFootball) March 4, 2023 🏆 KARNATAKA ARE CHAMPIONS AFTER 5️⃣4️⃣ YEARS 🏆 It was a close call in the end, but Karnataka get over the line in the end 🤩 MEG 2⃣-3⃣ KAR 📺 @FanCode & @ddsportschannel #MEGKAR ⚔️ #HeroSantoshTrophy 🏆 #GrandFinale 💥 #IndianFootball ⚽ pic.twitter.com/tUVsvggPBE — Indian Football Team (@IndianFootball) March 4, 2023 చదవండి: సీఎస్కే కెప్టెన్‌గా బెన్ స్టోక్స్!? ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె కొత్త చరిత్ర.. -
కరోనాతో జాతీయ మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి
మలప్పురం (కేరళ): జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కేరళ ఫుట్‌బాల్ ప్లేయర్ హమ్జా కోయా శనివారం కరోనా వైరస్‌తో మృతి చెందారు. 61 ఏళ్ల హమ్జా కోయా 1981 నుంచి 1986 వరకు సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగారు. అంతేకాకుండా దేశంలోని ప్రముఖ పుట్‌బాల్ క్లబ్‌లు మోహన్ బగాన్, మొహమ్మదన్ స్పోర్టిం గ్ జట్ల తరఫున ఆడారు. రెండుసార్లు భారత ఫుట్‌బాల్ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ముంబైలో స్థిరపడిన హమ్జా కోయా తన కుటుంబసభ్యులతో కలిసి మే 21న రోడ్డు మార్గం ద్వారా ముంబై నుంచి కేరళకు వచ్చారు. ఆయనతోపాటు భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు మునిమనవళ్లకు కూడా కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న హమ్జా కోయా స్థానిక మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం ఉదయం మృతి చెందారు. -
13 ఏళ్ల తర్వాత...
కోల్‌కతా: జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో 13 ఏళ్ల తర్వాత కేరళ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన తుదిపోరులో కేరళ 4–2తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్‌పై నెగ్గి ఆరోసారి ఈ టైటిల్ గెలుచుకుంది. మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. కేరళ తరఫున 19వ నిమిషంలో ఎస్. జితిన్ గోల్ సాధించడంతో తొలి అర్ధభాగంలో కేరళ ఆధిపత్యం సాగింది. రెండో అర్ధభాగంలో బెంగాల్ తరఫున 68వ నిమిషంలో జితెన్ ముర్మూ గోల్ చేయడంతో స్కోరు 1–1తో సమమైంది. అదనపు సమయంలో బెంగాల్ తరఫున రాజన్ బర్మన్ (112వ ని.లో), కేరళ తరఫున విబిన్ థామస్ (117వ ని.లో) చెరో గోల్ సాధించడంతో మ్యాచ్ 2–2తో మళ్లీ సమమైంది. దీంతో షూటౌట్ ద్వారా విజేతను తేల్చారు. షూటౌట్లో కేరళ తరఫున రాహుల్ వి రాజ్, జితిన్ గోపాలన్, జెస్టిన్ జార్జ్, ఎస్. సిసాన్ గోల్స్ సాధించగా... బెంగాల్ తరఫున తీర్థాంకర్, సాంచయన్ సమద్దర్లు మాత్రమే గోల్ చేయడంలో సఫలమయ్యారు. దీంతో 4–2తో కేరళ విజయం ఖాయమైంది. -
మిజోరం ‘సంతోషం’
తొలిసారి జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సొంతం సిలిగురి: జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో సంచలనం నమోదైంది. అందరి అంచనాలను తారుమారుచేస్తూ ఆద్యంతం అద్భుతంగా ఆడిన మిజోరం జట్టు తొలిసారి జాతీయ చాంపియన్‌గా అవతరించింది. 68 ఏళ్ల ఈ ట్రోఫీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరిన మిజోరం... ఆదివారం రైల్వేస్ జట్టుతో జరిగిన తుదిపోరులో 3-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. జికో జోరెమ్సంగా (44వ, 61వ నిమిషాల్లో) రెండు గోల్స్, లాల్రింపియా (90+1వ నిమిషం) ఒక గోల్ నమోదు చేశారు. పలుసార్లు వచ్చిన అవకాశాలను సొమ్ము చేసుకోలేకపోయిన రైల్వేస్ గోల్ రహితంగా మిగిలిపోయింది. దీంతో 28 ఏళ్ల తరువాత తొలిసారి ఫైనల్‌కు చేరినా టైటిల్‌ను మాత్రం సాధించలేకపోయింది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా మూడుసార్లు (1961, 1964, 1966) విజేతగా నిలిచిన రైల్వేస్ ఇంతకుముందు 1986లో చివరిసారిగా ఫైనల్‌కు చేరింది.