
ప్రధాని నరేంద్ర మోదీ , రాహుల్ ద్రవిడ్
బెంగళూరు: అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. భారత జట్టు ఒక్క ఓటమిని కూడా చవిచూడకుండా భారీ విజయాలతో వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుందంటే ఆ వెనుక ద్రవిడ్ పాత్ర ఎంతో ఉందని కొనియాడారు.
ఈ మేరకు ఆదివారం బెంగళూరు పర్యటనలో భాగంగా ప్యాలెస్ గ్రౌండ్ మెగా ర్యాలీలో ద్రవిడ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. 'నీతి నిజాయితీకి ద్రవిడ్ మరోమారు. అదే భారత్‌కు చిరస్మరణీయమైన వరల్డ్ కప్‌ను అందించింది. భారత విజయం వెనుక ద్రవిడ్ పాత్ర అమోఘం. మనందరికీ అతనొక ఆదర్శం. నీతిగా పని చేయాలనేది ద్రవిడ్‌ను చూసి నేర్చుకుందాం' అని మోదీ ప్రశంసించారు. ఇటీవల న్యూజిలాండ్ వేదికగా ముగిసిన అండర్ 19 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ను కూడా కోల్పోకుండా ద్రవిడ్ పర్యవేక్షణలోని యువ భారత జట్టు కప్‌ను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment