మోమినుల్ హక్
చిట్టగాంగ్: సొంతగడ్డపై శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టులో బంగ్లాదేశ్ చెలరేగింది. బ్యాట్స్‌మెన్ దూకుడుతో తొలి రోజు బుధవారం ఆట ముగిసే సరికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోరు సాధించింది. మోమినుల్ హక్ (203 బంతుల్లో 175 బ్యాటింగ్; 16 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకం సాధించడం విశేషం.
96 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న మోమినుల్‌కు కెరీర్‌లో ఇది ఐదో శతకం. మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (192 బంతుల్లో 92; 10 ఫోర్లు) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోగా, తమీమ్ ఇక్బాల్ (52) రాణించాడు. ప్రస్తుతం మోమినుల్‌తో పాటు కెప్టెన్ మహ్ముదుల్లా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. లక్మల్‌కు 2 వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment