శ్రీలంక భారీస్కోరు | Sri Lanka huge score | Sakshi
Sakshi News home page

శ్రీలంక భారీస్కోరు

Published Thu, Mar 9 2017 12:21 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

Sri Lanka huge score

గాలే: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలిటెస్టులో శ్రీలంక భారీస్కోరు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 321/4తో రెండో రోజు బుధవారం ఆట కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో  494 పరుగుల వద్ద ఆలౌటైంది. కుశాల్‌ మెండిస్‌ (194; 19 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆరు పరుగుల తేడాతో డబుల్‌ సెంచరీని చేజార్చుకున్నాడు.

తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (57; 6 ఫోర్లు), సౌమ్య సర్కార్‌ (66 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement