న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మిడిల్ ఆర్డర్ నుంచి టాప్ ఆర్డర్‌కు పంపాలనే టీం మేనేజ్‌మెంట్ నిర్ణయం మంచిదేనని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. శ్రీలంకతో జరగుతున్న మూడు ట్వంటీ-20 మ్యాచ్‌లలో ధోనిని నాలుగో స్థానంలో క్రీజులోకి దించాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు వెల్లడించారు. ధోని లాంటి ఆటగాడికి తగ్గ నాలుగో స్లాట్ జట్టుకు మేలు చేకూరుస్తుందని చెప్పుకొచ్చారు.
కొన్నేళ్లుగా ధోని మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ విపరీతమైన ఒత్తిడిని అధిగమించి విజయాలు సాధించిపెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక ధోనిపై ఆ ఒత్తిడిని తగ్గించి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కల్పిస్తే బావుంటుందని అన్నారు. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ధోని 22 బంతుల్లో 39 పరుగులు చేశారు. ధోని ఇన్నింగ్స్ 180 పరుగుల భారీ లక్ష్యాన్ని లంక ముందు ఉంచేందుకు ఉపకరించింది.
Comments
Please login to add a commentAdd a comment