చెన్నై: ఈ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభ తేదీ ఖరారైన నేపథ్యంలో ప్రతీ ఫ్రాంచైజీ అందుకోసం సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే రాయల్ చాలెంజర్స బెంగళూరు(ఆర్సీబీ) కొత్త లోగోతో ఈ సీజన్‌ను ఆరంభించడానికి సిద్ధమవుతుండగా, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కూడా ప్రాక్టీస్‌కు సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన ప్రాక్టీస్‌కు రంగం సిద్ధం చేసుకున్నాడు. మార్చి ఒకటవ తేదీ నుంచి చెపాక్ స్టేడియంలో ధోని ప్రాక్టీస్‌ను ఆరంభించనున్నాడు. (ఇక్కడ చదవండి: ‘ఆ విషయంలో ధోనికి పూర్తి స్వేచ్ఛ’)
గత నెలలో జార్ఖండ్ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసిన ధోని.. ఐపీఎల్ కోసం తన ప్రాక్టీస్‌ను ముమ్మరం చేయాలని చూస్తున్నాడు. మార్చి తొలి వారం నుంచి మొదలుకొని సీజన్ ఆరంభం అయ్యేవరకూ ప్రాక్టీస్ కొనసాగించాలని భావిస్తున్నాడు. అతనిపాతో సురేశ్ రైనా, అంబటి రాయుడులు కూడా ప్రాక్టీస్‌కు సమాయత్తమవుతున్నారు.
గత ఏడాది జూలై 9న న్యూజిలాండ్‌తో వన్డే వరల్డ్‌కప్ సెమీస్ ఓటమి తర్వాత ధోని క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. మధ్యలో పలుమార్లు అతడి రిటైర్మెంట్‌పై వార్తలొచ్చాయి. అయితే ధోని తిరిగి టీమిండియాలోకి వచ్చేందుకు ఐపీఎల్ వేదికని అంతా భావిస్తున్న నేపథ్యంలో.. ఆ టోర్నీ షెడ్యూల్ ఆరంభపు తేదీ ఖరారైంది. మార్చి 29వ తేదీన ఐపీఎల్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment