దుబాయ్: వ్యక్తిగత కారణాలతో ఇటీవల దుబాయ్ నుంచి స్వదేశానికి వచ్చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా గురించి రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. కాసేపు రైనా మళ్లీ జట్టుతో కలుస్తాడనే ఒకవైపు వార్తలు వస్తుండగానే సీఎస్‌కే వాట్సాప్ గ్రూప్ నుంచి అతని పేరును తొలగించినట్లు మరొక వార్త చక్కర్లు కొడుతోంది. స్వదేశానికి తిరిగి వచ్చేసిన వెంటనే రైనాను జట్టు వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించినట్లు సమాచారం. రైనా సరైన కారణాలు చెప్పకుండా స్వదేశానికి వచ్చేయడమే వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించడానికి కారణంగా తెలుస్తోంది. రైనా ‘ఉన్నపళంగా స్వదేశానికి’ నిర్ణయంతో సీఎస్‌కే యాజమాన్యం తీవ్ర అసంతృప్తిలో ఉన్న నేపథ్యంలోనే అతన్ని వాట్సాప్ గ్రూప్‌లో ఉద్వాసన పలికినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా, తమకు వైజ్ కెప్టెన్ ఉన్నాడు.. వైస్ కెప్టెన్ ఎందుకు అని ఒక అభిమానికి సీఎస్‌కే ఇచ్చిన రిప్లై అనేది ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ వార్తల్లో నిజం తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.(చదవండి: కోహ్లి.. చెప్పడానికి ఏమీ లేదు: ఆర్సీబీ)
కాగా, తిరిగి జట్టులో చేరి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వాలని రైనా భావిస్తున్నాడు. తమది తండ్రీకొడుకుల సంబంధమని సీఎస్‌కే యాజమాని శ్రీనివాసన్ ప్రకటనతో వివాదానికి త్వరగానే ముగింపు పడినట్లు అయ్యింది. తొలుత రైనాపై చిందులు తొక్కిన శ్రీనివాసన్.. తర్వాత ఆదిలోనే వివాదం ఎందుకని కాస్త మెత్తబడ్డారు. దాంతో రైనాకు లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది. ఈ క్రమంలోనే జట్టు యాజమాన్యానికి రైనా క్షమాపణలు తెలిపినట్లు తెలుస్తోంది. ఇక రైనా తిరిగి జట్టుతో చేరేది.. లేనిది కెప్టెన్ ఎంఎస్ ధోని నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. ఇప్పటివరకూ రైనాకు ప్రత్యామ్నాయ ఆటగాడ్ని ఎవర్నీ ప్రకటించకపోవడంతో అతని రాక ఖాయంగానే కనిపిస్తోంది. మరి రైనా సీఎస్‌కేతో ఈ ఏడాది ఆడతాడా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తోంది. (చదవండి: నా లైఫ్‌లోనే ఇదొక వరస్ట్: అశ్విన్)
సీఎస్‌కే వాట్సాప్ గ్రూప్ నుంచి రైనా ఔట్?
Published Fri, Sep 4 2020 12:04 PM | Last Updated on Sat, Sep 19 2020 3:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment