దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-13వ సీజన్ కోసం యుఏఈకి వెళ్లిన ఫ్రాంచైజీల్లో ఎక్కువ కలవర పాటుకు గురైన జట్టు ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్. కరోనా శకంలో క్యాష్ రిచ్ లీగ్‌ను నిర్వహించడానికి పెద్దగా కేసులు లేని యూఏఈని వేదికగా నిర్ణయించుకున్నా, సీఎస్‌కే ఎలా కరోనా బారిన పడింది అనేది ఆ జట్టు కలవరపాటుకు కారణం. అందరకంటే ముందు ప్రాక్టీస్ అంటూ భారత్‌లో కరోనా విజృంభణ లేని సమయంలోనే సీఎస్‌కే ఐపీఎల్‌కు సిద్ధపడగా, అది వాయిదా పడటంతో ఆ ప్రాక్టీస్ కొన్ని రోజులకే పరిమితమైంది. ఇప్పుడు యూఏఈలో కూడా ముందుగా ప్రాక్టీస్ చేయాలని భావించిన ధోని అండ్ గ్యాంగ్‌కు ఆదిలోనే చుక్కదురైంది. జట్టులో మొత్తం సిబ్బందితో కలుపుకుని 13 మంది కరోనా బారిన పడటం ఒక్కసారిగా అలజడి రేగింది. ఇక సీఎస్‌కే స్టార్ ఆటగాడు, వైస్ కెప్టెన్ సురేశ్ రైనా ఉన్నపళంగా మూటాముళ్లు సర్దుకుని యూఏఈ నుంచి భారత్‌కు రావడం ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ. (చదవండి:రైనా నిష్ర్కమణపై శ్రీనివాసన్ ఆగ్రహం)
బయో బబుల్ వాతావరణంలో కఠిన నిబంధనలు పాటిస్తూ హోటల్‌లోనే ఆటగాళ్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన స్థితిలో తనకు ఇచ్చిన గది మొదటి రోజే రైనాకు నచ్చలేదు. కనీసం దానికి సరైన బాల్కనీ కూడా లేదని అతను అన్నట్లు తెలిసింది. చివరకు సరిగ్గా ధోనికిచ్చిన తరహా గది తనకు కావాలంటూ అతను కోరాడు. అయితే తగిన స్పందన రాకపోవడంతో చివరకు ధోనికే విషయం చెప్పిన ఫలితం లేకపోవడంతో రైనా స్వదేశానికి వచ్చేశాడు. ఇటీవల ధోనితో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రైనా ఇలా వచ్చేయడం హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఇది దుబాయ్ లైఫ్ అంటూ ఒక ఫోటోను కూడా రైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఆ గది ఇష్టం లేకనే దుబాయ్ లైఫ్ అని రైనా పేర్కొన్నాడా అనే అనుమానం ఇప్పుడు అభిమానుల్లో వ్యక్తమవుతుంది.
ఇక క్రమశిక్షణకు, నిబంధనలకు మారుపేరైనా సీఎస్‌కే కరోనా బారిన పడటం ఏమిటనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవైపు అంతర్జాతీ టోర్నీలు సక్సెస్‌ఫుల్‌గా జరుగుతున్న క్రమంలో సీఎస్‌కేకు ఎందుకు ఇలా జరిగిందనేది వార్తల్లోకెక్కింది. కొన్ని రోజులుగా ఫుట్‌బాల్ లీగ్‌లతో పాటు, అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు కూడా విజయవంతంగానే రన్ అవుతున్నాయి. బుండెస్లిగా, ప్రీమియర్ లీగ్, ల లిగాలు సక్సెస్‌ఫుల్‌గా ముగిశాయి. ఇక వెస్టిండీస్-ఇంగ్లండ్‌ల మధ్య ద్వైపాపాక్షిక సిరీస్ సక్సెస్‌ఫుల్‌గా ముగియగా, పాకిస్తాన్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ కూడా ముగింపు దశకు వచ్చేసింది. ఇక్కడ ఎక్కడ కూడా ఏ ఆటగాడు కరోనా బారిన పడిన దాఖలాలు లేవు. అయితే ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరేముందే పలువురు పాకిస్తాన్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ తేలగా వారంతా ఐసోలేషన్‌లో ఉండి దాన్ని జయించారు. ఇక రేపటితో(సెప్టెంబర్1) ఇరు జట్ల మధ్య సిరీస్ ముగుస్తుంది. మరొకవైపు కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) కూడా ఎటువంటి కరోనా సమస్యలు లేకుండా జరుగుతుంది.
సీఎస్‌కే చేసిన పొరపాటు ఏమిటి?
ఈ నెల 21 నుంచి యూఏఈలో ఆ జట్టు క్వారంటైన్‌లో ఉన్నా.. ఆటగాళ్లు నిబంధనలు అతిక్రమించడమే కాకుండా సామాజిక దూరం రూల్‌ని బ్రేక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యూఏఈలో ఉన్న మిగిలిన ఏడు జట్లలో కనీసం ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోగా.. ఒక్క చెన్నై టీమ్‌లోనే 13 కేసులు నమోదవడం ఆ వాదనకు బలం చేకూరుస్తోంది. వాస్తవానికి యూఏఈ ప్రయాణం సమయంలోనూ చెన్నై టీమ్ ఆటగాళ్లు విమానంలో నిబంధనల్ని అతిక్రమించారంట. ఇక యూఏఈ పర్యటనకు బయల్దేరే ముందు భారత్‌లో సీఎస్‌కే నిర్వహించిన ఆరు రోజుల క్యాంపులో ఆటగాళ్లతో సహచర సిబ్బంది మాస్క్‌లు లేకుండానే కనిపించారు. ఈ మేరకు ఫోటోలకు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఇదే ఆ జట్టు కరోనా బారిన పడటానికి కారణం కావొచ్చనేది ప‍్రధాన వాదన.(చదవండి: హ్యాట్రిక్ సిక్స్‌లతో సెంచరీ..)
Comments
Please login to add a commentAdd a comment