ముంబై దూకుడు
కోల్ కతా: ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ దూకుడుగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆదిలోనే పార్దీవ్ పటేల్ వికెట్ ను డకౌట్ రూపంలో కోల్పోయిన ముంబై బ్యాటింగ్ లో జోరును మాత్రం యథావిధిగా కొనసాగిస్తోంది.
పది ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 98 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ(39), సిమ్మన్స్ (56) లు వేగంగా స్కోరు బోర్డును ముందుకు పరుగులు పెట్టిస్తున్నారు.