
ముంబై: ఐపీఎల్‌లో భాగంగా సొంత మైదానం వాంఖేడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. సన్‌రైజర్స్ అద్భుత బౌలింగ్ ప‍్రదర్శనకు ఈ సీజన్‌లో తొలి పవర్ ప్లేలో అత్యల్ప స్కోరును నమోదు చేసిన జట్టుగా నిలిచింది. బలమైన బ్యాటింగ్ లైనప్ కల‍్గిన ముంబై.. సన్‌రైజర్స్ పటిష్ట బౌలింగ్ ముందు తడబడింది.
సన్‌రైజర్స్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై మొదటి ఆరు ఓవర్లలో(పవర్ ప్లే) మూడు వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసింది. దాంతో ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌ల్లో పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా అపప్రథను సొంతం చేసుకుంది. దాంతో చెన్నై నమోదు చేసిన 27 పరుగుల అత్యల్ప పవర్ ప్లే స్కోరును ముంబై సవరించినట్లయ్యింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో చెన్నై అత్యల్ప పవర్ ప్లే స్కోరును నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే అది కూడా సన్‌రైజర్స్ తో జరిగిన గత మ్యాచ్‌లోనే జరిగింది. ఆ మ్యాచ్‌లో చెన్నై తొలుత బ్యాటింగ్ చేసే క్రమంలో అత‍్యల్ప పవర్ ప్లే స‍్కోరుకు పరిమితం కాగా, ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఛేజింగ్ చేస్తూ అత‍్యల్ప పవర్ ప్లే స్కోరును నమోదు చేసింది. మరొకవైపు ఓవరాల్ ఐపీఎల్‌లో ముంబైకు ఇది నాల్గో అత్యల్ప పవర్ ప్లే స్కోరు.
Comments
Please login to add a commentAdd a comment