ముంబై: విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, ఇలా ప్రతిఒక్క ఆటగాడిని తాను హ్యాండిల్ చేశానని వారికి అవసరమైనప్పుడు తగిన సూచనలు ఇచ్చేవాడినని మాజీ క్రికెటర్, టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. వారిని దారిలోకి తీసుకురావడం, వారి ఫామ్ లో లేకుంటే లోపాలను సరిదిద్దడం తన బాధ్యతగా తీసుకున్నానని చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ను విదేశాలలో నిర్వహిస్తారన్న వార్తలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఐపీఎల్ టోర్నీని వచ్చే ఏడాది ఎక్కడ నిర్వహిస్తారని మాజీ క్రికెటర్, టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రిని ప్రశ్నించగా... ఈ టోర్నీని ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉందన్నాడు. విదేశాలలో నిర్వహించడం మంచి విషయమే కానీ ఇండియాలో ఉన్నంత జోష్ అక్కడ ఎలా వస్తుందంటూ వ్యాఖ్యానించాడు.
ఐపీఎల్ నిర్వహణలో లోపాలున్నాయని ఆరోపణలొస్తున్న నేపథ్యంలో రవిశాస్త్రి స్పందించాడు. ఐపీఎల్ లో తనకు తెలిసినంతవరకూ కేవలం ఐదు, ఆరు శాతం మాత్రమే నెగటివ్స్ ఉన్నాయని, అంతమాత్రాన ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే టోర్నీపై విమర్శలు చేయడం తగదన్నారు. టీమిండియాకు డైరెక్టర్ గా మాత్రమూ కాకుండా ఆటగాళ్లతో చాలా కలుపుగోలుగా ఉంటూ వారిలో ఉత్సాహాన్ని నింపాడు. ఐపీఎల్ ను కొందరు ఆటలాగానే చూస్తున్నారు కానీ, భారీ వ్యాపారం జరిగి ఎంతో మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నాడు. బీసీసీఐ నూతనంగా ఏర్పాటుచేసిన సీఈఓ పదవి అనేది బోర్డు చేసిన మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డాడు.
'కోహ్లీ, ధోనీలను హ్యాండిల్ చేశాను'
Published Sat, Apr 23 2016 7:44 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM
Advertisement