టీమిండియా చీఫ్ కోచ్ ఫ్లెచరే!
లండన్:టీమిండియాలో తనకు తాజాగా కల్పించిన బాధ్యతతో చీఫ్ కోచ్ డంకెన్ ఫ్లెచర్ పదవికి ముప్పేమీ లేదని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. తాను టీమిండియా డైరెక్టర్ నియమితులైయ్యాక ఫ్లెచర్ పాత్ర నామమాత్రమే అన్న ప్రశ్రలకు రవిశాస్త్రి పై విధంగా స్పందించాడు. 'నేను టీమిండియా డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకోనున్నాను. ఇంగ్లండ్ లో భారత్ ఘోర ఓటమితో నాకు ఈ పదవిని అప్పజెప్పారు. ఆటగాళ్లకు సంబంధించి ప్రతీ నివేదిక నా వద్ద ఉంటుంది. అయితే ఇంగ్లండ్ సిరీస్ కు వరకూ మాత్రమే నన్ను ఎంపిక చేశారు. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ ఫ్లెచర్ పాత్ర ఏ మాత్రం తగ్గదు. అతను ఎప్పటిలానే చీఫ్ కోచ్ గా ఉంటారు'అని రవిశాస్త్రి తెలిపాడు.
ఇంగ్లండ్‌తో టెస్టుల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి వన్డే సిరీస్‌పైనే. చీఫ్ కోచ్ డంకన్ ఫ్లెచర్ అధికారాలను కత్తిరించి.. టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని నియమించడంతో ఈ భారత మాజీ కెప్టెన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 25న మొదలయ్యే ఐదు వన్డేల సిరీస్‌లో రవిశాస్త్రి సరికొత్త బాధ్యతలు చేపట్టబోతున్నా.. ఫ్లెచర్ పదవిలో ఎటువంటి మార్పులేదన్నారు.