మారేడ్‌పల్లి, న్యూస్‌లైన్: శ్రీలక్ష్మీనర్సు రాష్ట్రస్థాయి స్నూకర్ పోటీల్లో నాగభూషణ్ రావు ముందంజ వేశాడు. వెస్ట్ మారేడుపల్లిలోని న్యూక్లబ్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో భాగంగా సూరి (కర్నూలు)తో జరిగిన పోటీలో నాగభూషణ్‌రావు (న్యూక్లబ్) 3-2తో గెలిచాడు.
ఇతర మ్యాచ్‌ల్లో తే జేందర్ అగర్వాల్ (ఎఫ్‌ఎంసీ) 3-1తో ఆండిచిన్ (సికింద్రాబాద్)పై, శివశర్మ (డెస్టినేషన్ క్లబ్) 3-0తో నవీన్(ఎపీబీఎస్‌ఏ)పై, అశుతోష్ (ఎపీబీఎస్‌ఏ) 3-0తో వి.జయేందర్ బాబుపై, విశాల్ అగర్వాల్ (ఎఫ్‌ఎంసీ) 3-0తో బాబరుద్దీన్‌పై, గంగాధర్ (విశాఖపట్నం) 3-0తో ఎం. ఆనంద్‌కుమార్ (న్యూక్లబ్)పై విజయం సాధించారు. గురువారం జరిగే పోటీలో ఏపీ సీడెడ్ ఆటగాళ్లు జేమ్స్‌సుందర్, ఐవీ రాజీవ్, ప్రవీణ్‌కుమార్, హిమాన్షు జైన్ (న్యూక్లబ్), వెంకటేశంలు బరిలోకి దిగనున్నారు.
నాగభూషణ్ విజయం
Published Thu, Oct 24 2013 12:44 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
Advertisement
Advertisement