వైష్ణవి, కార్తీక్‌లకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు మెరిశారు. రెండేసి చొప్పున స్వర్ణ, రజత పతకాలు సాధించారు. తెలంగాణ కుర్రాడు కార్తీక్ కుమార్ బాలుర అండర్-11 విభాగంలో పసిడి పతకం గెలువగా, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చిన్నం వైష్ణవి అండర్-9 బాలికల ఈవెంట్‌లో బంగారు పతకం నెగ్గింది.
ఢిల్లీలోని చెస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలు సోమవారం ముగిశాయి. ఇందులో హైదరాబాద్‌కు చెందిన కార్తీక్ కుమార్ చక్కని ప్రదర్శన కనబరిచాడు. అమ్మాయిల్లో గుంటూరు బాలిక వైష్ణవి కూడా నిలకడైన విజయాలు సాధించింది. విజయవాడకు చెందిన అక్షిత్ కుమార్ బాలుర అండర్-11 విభాగంలో, చైతన్య సాయి బాలుర అండర్-9 విభాగంలో రజత పతకాలు చేజిక్కించుకున్నారు.
జాతీయ స్కూల్ చెస్‌లో తెలుగు తేజాల ప్రతిభ
Published Wed, Jun 18 2014 12:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement