సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అమిత గొండి రెండు పతకాలతో మెరిసింది. శనివారం జరిగిన పోటీల్లో ఆమె స్వర్ణ, రజత పతకాలు సాధించింది. గచ్చిబౌలిలోని స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన రెండో రోజు పోటీల్లో ఆమె 100 మీటర్ల ఫ్రీస్టయిల్ (గ్రూప్-3) ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. ఆమె అందరికంటే ముందుగా 01.06.68 సెకన్లలో పోటీని పూర్తిచేసింది. 100 మీ. బటర్‌ఫ్లయ్ (గ్రూప్-3) ఈవెంట్‌లో అమిత రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచింది.
పోటీని 01.14.77 సెకన్లలో పూర్తి చేసింది. మేఘన కాంస్యం గెలిచింది. 100 మీ. బటర్‌ఫ్లయ్ బాలుర ఈవెంట్‌లో యశ్‌వర్మ (01.10.28 సె.) బంగారు పతకం సాధించాడు. 200 మీ. వ్యక్తిగత మెడ్లే బాలికల్లో సిమ్రాన్ (04.02.99 సె.), బాలురలో సాయి సంపత్ రెడ్డి కాంస్య పతకాలు గెలుపొందారు. 100 మీ. బటర్‌ఫ్లయ్ బాలికల్లో మేరీ జెస్సికా ప్యాట్రిక్ (01.48.72 సె.) కాంస్యం నెగ్గగా, 100 మీ. ఫ్రీస్టయిల్ బాలుర (గ్రూప్-3) ఈవెంట్‌లో వాసురామ్ (01.07.31 సె.) మూడో స్థానంలో నిలిచాడు.
అమితకు రెండు పతకాలు
Published Sun, Feb 9 2014 12:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement