కివీస్ ఆటపై గంగూలీ ఎద్దేవా
ధర్మశాల:భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు కనీసం పోరాడకుండానే లొంగిపోవడం పట్ల మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రస్తుత న్యూజిలాండ్ జట్టులో అంకితభావం, పట్టుదల, పోరాటస్ఫూర్తి లోపించాయని గంగూలీ అభిప్రాయపడ్డాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్రెండన్ మెకల్లమ్లు జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్న తరువాత కివీస్ ఆటగాళ్లు పోరాటాన్ని మరచిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశాడు.
'నిన్నటి వన్డే మ్యాచ్ చూశాను. అంతకుముందు టెస్టు సిరీస్ కూడా చూశాను. ఆ జట్టులో నిర్లక్ష్యం కనబడుతోంది. ఈ సిరీస్ ను తొందరగా ముగించేసి వెళ్ళిపోవాలని వారు తున్నట్లు ఉన్నారు. మ్యాచ్ కు సిద్ధమయ్యాకు ఆశల్ని మొత్తం వదిలేస్తున్నారు. ఒకసారి విఫలమైనా మళ్లీ భారత జట్టును ఓడించాలనే కసి వాళ్లలో లోపించింది. మార్టిన్ గప్టిల్ అవుటైన తరువాత వరుస పెట్టి క్యూకట్టేశారు. ప్రత్యేకంగా కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ అవుటైన విధానం చూడండి. మ్యాచ్ పై ఎటువంటి శ్రద్ధ లేకుండా ఆడినట్లు ఉంది. కనీసం 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి టిమ్ సౌథీ చూపిన పోరాటం కూడా మిగతా ప్రధాన ఆటగాళ్లు చూపలేకపోయారు. కివీస్ ఆటగాళ్లు ఎందుకిలా ఆడుతున్నారు' అని గంగూలీ ప్రశ్నించాడు.