ఆసియా చెస్‌ బ్లిట్జ్‌ చాంపియన్‌ నిహాల్‌ | Nihal Sarin wins blitz event at Asian Continental Chess Championship | Sakshi
Sakshi News home page

ఆసియా చెస్‌ బ్లిట్జ్‌ చాంపియన్‌ నిహాల్‌

Published Sun, Jun 16 2019 6:09 AM | Last Updated on Sun, Jun 16 2019 6:09 AM

Nihal Sarin wins blitz event at Asian Continental Chess Championship - Sakshi

నిహాల్‌ సరీన్‌

జింగ్‌తాయ్‌ (చైనా): భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ నిహాల్‌ సరీన్‌ ఆసియా చెస్‌ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్‌ విభాగంలో టైటిల్‌ సాధించాడు. శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో నిహాల్‌ ఎనిమిది పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 14 ఏళ్ల నిహాల్‌ ఏడు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. భారత్‌కే చెందిన ఎస్‌.ఎల్‌.నారాయణన్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకోగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఎరిగైసి అర్జున్‌ 6.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు క్లాసిక్‌ విభాగం ఓపెన్‌ కేటగిరీలో భారత గ్రాండ్‌మాస్టర్స్‌ కార్తికేయ మురళి, సేతురామన్‌ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. కార్తికేయ, సేతురామన్‌తోపాటు నారాయణన్‌ కూడా వరల్డ్‌ కప్‌ చెస్‌ టోర్నమెంట్‌కు అర్హత పొందారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement