
టోక్యో: కరోనా కారణంగా ఇప్పటికే వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి వాయిదా వేసే ప్రసక్తే లేదని ఒలింపిక్స్ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూలై 23వ తేదీనే ఒలింపిక్స్ ప్రారంభమవుతాయని ఆయన పునరుద్ఘాటించారు. ‘2021లో అనుకున్న సమయానికే క్రీడలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి వాయిదా అనేది ఉండదు. ఇప్పటికే ఒక ఏడాది పొడిగించాం. ఇంకో ఏడాది పొడిగించడమనేది అసంభవం. గతంలోనే మేం ప్రధానితో రెండేళ్ల వాయిదా గురించి చర్చించాం. కానీ ఇందులో ఎదురయ్యే లెక్కకు మిక్కిలి ఇబ్బందుల గురించి చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని మోరీ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 వ్యాప్తి ఇప్పటికీ నియంత్రణలోకి రాకపోవడంతో 2021లోనూ ఈ మెగా ఈవెంట్ నిర్వహణ సాధ్యం కాదంటూ పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment