అసత్య ప్రమాణం చేయలేదు: అనురాగ్‌ | Not OF PERJURY: Anurag | Sakshi
Sakshi News home page

అసత్య ప్రమాణం చేయలేదు: అనురాగ్‌

Published Thu, Dec 22 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 11:17 PM

Not OF PERJURY: Anurag

జైపూర్‌: భారత న్యాయవ్యవస్థపై తనకు గౌరవం ఉందని... తాను ఎలాంటి అసత్య ప్రమాణం చేయలేదని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ వివరణ ఇచ్చారు. కాబట్టి జైలుకు వెళ్లాలనే ప్రశ్న తలెత్తదని స్పష్టం చేశారు. లోధా కమిటీ సిఫారసులను చర్చించి అమలు చేసే దిశగా ఆ కమిటీ తమకు సమయమే ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. ‘ఇప్పుడీ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పటికే కమిటీ సిఫారసులపై పలుమార్లు సమావేశమై చర్చించాం.

వీటిలో 85 శాతం అమలు చేస్తున్నాం. మిగిలిన మూడు, నాలుగు ప్రతిపాదలపైనే తేల్చాల్సి ఉంది. ఇవి ఆచరణలో సాధ్యం కావు. అయినా వీటిపై కూడా కూలంకశంగా చర్చించి నిర్ణయం తీసుకుందామనుకున్నా... ఆ దిశగా లోధా కమిటీ మాకు సమయమే ఇవ్వట్లేదు’ అని ఠాకూర్‌ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement