
సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ సోమవారం ప్రకటించబోయే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోనున్నాడు. కడుపు నొప్పితో పారిస్ మాస్టర్స్ టోర్నీనుంచి రాఫెల్ నాదల్ అనూహ్యంగా తప్పుకోవడంతో సరిగ్గా రెండేళ్ల తర్వాత నొవాక్‌కు నంబర్‌వన్ ఖాయమైంది.
2000లో మారత్ సఫిన్ (38వ ర్యాంక్) తర్వాత సీజన్ ప్రారంభమైనప్పుడు 20కంటే ఎక్కువ ర్యాంక్‌లో ఉండి నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగిస్తున్న తొలి ఆటగాడు జొకోవిచ్ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో అతను 22వ ర్యాంక్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment