మాస్కో: అమెరికా టెన్నిస్ దిగ్గజం జిమ్మీ కానర్స్, రష్యా స్టార్ మరియా షరపోవాల గురుశిష్యుల బంధం నెలరోజుల ముచ్చటే అయింది. నెలరోజుల క్రితం ఆయనను కోచ్‌గా నియమించుకున్న ఈ రష్యా రమణి ఒక్క మ్యాచ్‌తోనే కానర్స్ కోచింగ్‌కు మంగళం పాడింది. సిన్సినాటి మాస్టర్స్ టోర్నమెంట్‌లో స్లోన్ స్టీఫెన్స్ చేతిలో షరపోవా ఓడింది.
కానర్స్ ఈ ఫలితంపై తేలిగ్గా ట్వీట్ చేయడంతో విభేదించిన షరపోవా ఆయన్ను కోచ్‌గా తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో కోచ్ లేకుండా ఆమె యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ బరిలోకి దిగనుంది. జిమ్మీ కానర్స్‌ను ఆమె గత నెలలోనే కోచ్‌గా నియమించుకుంది. అప్పుడు ఆయన భాగస్వామ్యంపై ఎంతో ఆసక్తిని కనబరిచిన ఆమె అంతలోనే ఆయన కోచ్‌గిరికి ఫుల్‌స్టాప్ పెట్టింది.
ఒక్క మ్యాచ్‌కే కోచ్‌పై వేటు
Published Sat, Aug 17 2013 1:42 AM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM
Advertisement
Advertisement