సెమీస్‌లో సాకేత్ జంట | Open ATP Challenger tennis tournament, Saket couple of semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాకేత్ జంట

Published Thu, Mar 24 2016 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

Open ATP Challenger tennis tournament, Saket couple of semis

సాక్షి, హైదరాబాద్: షెన్‌జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారుడు సాకేత్ మైనేని డబుల్స్‌లో సెమీస్‌లోకి... సింగిల్స్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. చైనాలో బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 149వ ర్యాంకర్ సాకేత్ 7-5, 6-3తో ప్రపంచ 98వ ర్యాంకర్, ఐదో సీడ్ లుకాస్ లాకో (స్లొవేకియా)పై సంచలన విజయం సాధించాడు. మరోవైపు డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంటకు తారో డానియెల్ (జపాన్)-డానియల్ ట్రేవర్ (స్పెయిన్) నుంచి వాకోవర్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement